తేజ‌-బాల‌య్య‌.. ముందు అనుకున్న‌దే..!


రెండు భిన్న‌ధృవాలు క‌లిసి ఉంటాయి. కానీ స‌దృవాలు మాత్రం క‌ల‌వ‌వు. అదే సైన్స్. ఒకే మ‌న‌స్త‌త్వం ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసుండ‌టం చాలా క‌ష్టం. అర్థం చేసుకునే టైమ్ కూడా ఉండ‌దు. ఆయ‌న‌కు కోపం వ‌స్తే.. ఇత‌డికి కూడా కోపం వ‌స్తుంది. అలాంట‌ప్పుడు స‌మ‌స్య పెద్ద‌దే అవుతుంది కానీ ప‌రిష్కారం కాదు. ఇప్పుడు మ‌నం చెప్పుకున్న ఈ క‌థ‌లో ఒకే మ‌న‌స్త‌త్వం క‌లిగిన వాళ్లు బాల‌య్య అండ్ తేజ‌. ఈ ఇద్ద‌రికి కోపం ఎక్కువే.
పైగా ముక్కుసూటి త‌నం కూడా. మ‌న‌సులో దాచుకోకుండా పైకి ఏది అనిపిస్తే అది చెప్పే వాళ్లు. అలాంటి ఇద్ద‌రు క‌లిసి ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌లు పెట్టారు. ఈ సినిమా అనౌన్స్ అయిన‌ప్ప‌ట్నుంచీ కూడా తేజ‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్ ఏంటి.. బాల‌య్య‌ను తేజ త‌ట్టుకుంటాడా అనే అనుమానాలే అంద‌ర్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే నిజ‌మైంది కూడా. తేజ ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్నాడు.
చాలా రోజులుగా ఈ చిత్రం తాను చేయలేనేమో అనే ఊహ‌ల్లోనే ఉన్నాడు తేజ‌. అదే ఇప్పుడు చేసాడు. ఇంత పెద్ద సినిమాను తాను హ్యాండిల్ చేయ‌లేన‌ని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ బాగా వ‌చ్చేలా ట్రై చేస్తాన‌ని చెప్పాడు. కానీ బాల‌య్య‌తో వ‌చ్చిన విభేధాల కార‌ణంగా సినిమా నుంచి త‌ప్పుకున్నాడు తేజ‌. ఇప్పుడు ఈ స్థానం లోకి రాఘ‌వేంద్ర‌రావ్ వ‌చ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే ఎన్టీఆర్ గురించి ద‌ర్శ‌కేంద్రుడి కంటే ఎవ‌రికి బాగా తెలియ‌ద‌ని బాల‌య్య ఫీల్ అవుతున్నాడు. పైగా ఆయ‌న‌తో చాలా సినిమాల‌కు ప‌ని చేసిన అనుభ‌వం ద‌ర్శ‌కేంద్రుడి సొంతం. దాంతో ఇప్పుడు ఆయ‌న అయితేనే క‌రెక్ట్ అని అటు వైపు అడుగేస్తున్నాడు బాల‌య్య‌. చూడాలిక‌.. అంతా క‌లిసి పెద్దాయ‌న్ని ఏం చేస్తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here