త‌న‌యుడు నో అన్నా.. తండ్రి ఎస్ అన్నాడు..


ఐదేళ్ల కింద ఆయన ద‌ర్శ‌కుడు అయ్యాడు.. నాలుగు విజ‌యాలు అందుకున్నాడు.. మూడేళ్ల కింద తొలిసారి ఆ హీరోతో సినిమా క‌మిట‌య్యాడు.. రెండుసార్లు ఇప్ప‌టికే ఒప్పుకున్న సినిమా ఆగిపోయింది.. చివ‌రికి త‌న‌యుడు నో అన్నా తండ్రి మాత్రం ఎస్ అన్నాడు. ఇంత‌కీ ఈ క‌థ ఎవ‌రిదో తెలుసా..? స‌ంచ‌ల‌న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. అవును.. ఈయ‌న రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయాల‌ని చాలా ఏళ్లుగా అనుకుంటున్నాడు.
మిర్చి త‌ర్వాత బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా ఓ సినిమా మొద‌లుపెట్టాడు కొర‌టాల‌. కానీ ఈ చిత్రం అనుకోకుండా ఆగిపోయింది. ఆ త‌ర్వాతే శ్రీ‌మంతుడు చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. ఆ త‌ర్వాత జ‌న‌తా గ్యారేజ్.. భ‌ర‌త్ అనే నేను చేసాడు. ఇక ఆ మ‌ధ్య మ‌రోసారి రామ్ చ‌ర‌ణ్ సినిమా ఉంద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ ఇప్పుడు కూడా మ‌రోసారి చ‌ర‌ణ్ సినిమా ఆగిపోయేలా ఉంది. ఈ సారి ఆగిపోవ‌డం కాదు కానీ ఆల‌స్యం అవుతుంది. ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను.. త‌ర్వాత రాజ‌మౌళి లైన్ లో ఉండ‌టంతో కొర‌టాల మ‌రో రెండేళ్లైనా చ‌ర‌ణ్ కోసం చూడాలి.
అందుకే ఆయ‌న్ని కాద‌ని ఇప్పుడు చిరు వైపు వెళ్తున్నాడు కొర‌టాల‌. ఇప్ప‌టికే మెగాస్టార్ కు కొర‌టాల ఓ క‌థ చెప్పడం.. ఆయ‌న ఓకే చెప్ప‌డం కూడా జ‌రిగిపోయాయి. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం క‌నిపిస్తుంది. మొత్తానికి త‌న‌యుడు నో అన్నా కూడా తండ్రితో మాత్రం సినిమా ఎస్ అనిపించాడు కొర‌టాల‌. మ‌రి చూడాలిక‌.. ఈ ద‌ర్శ‌కుడి సంచ‌ల‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here