త‌మిళ మ‌గాడు ఎలా ఉన్నాడో తెలుసా..?


త‌మిళ మ‌గాడా.. ఆయ‌న ఎవ‌రు అనుకుంటున్నారా..? ఎక్కువ‌గా ఆలోచించొద్దు.. అత‌డే ఆర్య‌. మ‌రి ప్ర‌త్యేకంగా మ‌గాడు అని చెప్ప‌డం ఏంటి అనుకుంటున్నారా..? మ‌రి ఆయ‌న చేస్తోన్న సినిమా అలా ఉంది. ప్ర‌స్తుతం మ‌నోడు గ‌జినికాంత్ అనే సినిమా చేస్తున్నాడు. టైటిల్ విచిత్రంగా ఉంది క‌దా..!
ఈ చిత్ర కాన్సెప్ట్ వింటే ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఇందులో హీరో అన్నీ మ‌రిచిపోతుంటాడు.. ఓ ప‌ని చేస్తున్న‌పుడు మ‌రో ప‌ని గాల్లోకి వెళ్లిపోతుంది. అదేంటి.. ఈ క‌థ భ‌లేభ‌లే మ‌గాడివోయ్ ది క‌దా అనుకుంటున్నారా..? అవును.. మ‌న సినిమానే అక్క‌డ రీమేక్ చేస్తున్నారిప్పుడు. అది కూడా గ‌జినికాంత్ పేరుతో. గ‌జిని అంటే మ‌రుపుకు బ్రాండ్ అంబాసిడ‌ర్. దాంతో పాటు ర‌జినీకాంత్ ఇమేజ్ ను కూడా వాడుకుంటూ గ‌జినీకాంత్ అని పెట్టేసారు.
ప‌వ‌ర్ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. చాలా కాలంగా హిట్ అనే మాటే లేని ఆర్య ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెడుతున్నాడు. అఖిల్ ఫేమ్ స‌యేషా ఇందులో హీరోయిన్. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. మ‌క్కీకి మ‌క్కీ భ‌లేభ‌లే మ‌గాన్ని దించేసారు. మ‌రి చూడాలిక‌.. త‌మిళ భ‌లేభ‌లే మ‌గాడు ఎలా ఉండ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here