త‌మ్ముడితో చ‌ర‌ణ్.. కొడుకుతో ప‌వ‌న్.. 

మ‌నం ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ అనేది ఒక‌టి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో హీరోలు ఇది చాలా బాగా ఒంట ప‌ట్టించుకున్నారు. ఒక‌ప్పుడు కుటుంబాల‌ను వ‌దిలేసి నెల‌ల పాటు షూటింగ్ చేసేవాళ్లు హీరోలు. కానీ ఇప్పుడు అలా కాదు. ముందు ఫ్యామిలీ.. ఆ త‌ర్వాతే సినిమాలు. మ‌హేశ్.. ఎన్టీఆర్.. చ‌ర‌ణ్ లాంటి వాళ్ల‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఇప్పుడు ప‌వన్ కూడా ఇలాగే మారిపోతున్నాడు. తాజాగా ఆయ‌న కొడుకు అకీరా నంద‌న్ పుట్టిన‌రోజు నాడు ప్ర‌త్యేకంగా ఇంటికి వెళ్లి కొడుకుతో కాసేపు గ‌డిపాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌రోవైపు త‌మ్ముడుతో ఉన్నాడు చ‌ర‌ణ్. ఇక్క‌డ త‌మ్ముడు.. కొడుకు రెండూ అకీరా నంద‌నే. ఎప్రిల్ 8న ఈ కుర్రాడు 14వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మెగా బంధాల‌తో నెట్టింట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మొన్న‌టికి మొన్న మార్చ్ 27న చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు నాడు కూడా త‌న‌ను విష్ చేయ‌డానికి వ‌చ్చి త‌న ప్రేమను చూపించాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్పుడు త‌న‌యుడి ద‌గ్గ‌రికి కూడా వ‌చ్చాడు. మొత్తానికి ప‌వ‌ర్ స్టార్ ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తార‌నేది అర్థ‌మ‌వుతుంది. మ‌రోవైపు అకీరాను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిటైర్ అయినా.. జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ సిద్ధంగా ఉన్నాడంటూ వాళ్లు పండ‌గ చేసుకుంటున్నారు. వ‌రుణ్ తేజ్ కంటే హైట్ అయ్యేలా క‌నిపిస్తున్నాడు అకీరా. ఇప్ప‌టికే ప‌వ‌న్.. చ‌ర‌ణ్ ను కూడా మించిపోయాడు అకీరా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here