త‌మ‌న్నా.. ఊపిరి ఆపేసిందిగా..

   
ఏడాది కింద ఊపిరి అనే సినిమా చేసింది త‌మ‌న్నా. ఇప్పుడు అదే ఊపిరి త‌న అందంతో తీస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య కాలంలో ఎప్పుడూ లేనంత హాట్ గా రెచ్చిపోయింది ఈ భామ‌. అది కూడా ల‌క్మే ఫ్యాష‌న్ వీక్ కోసం. అందులో మొత్తం అందాల‌న్నీ ఏం ఆర‌బోయ‌లేదు. సింపుల్ గా న‌డుమొంపుల్ని తీసి కెమెరాకు ఎరేసిందంతే. అంతే.. అక్క‌డున్న వాళ్ల‌తో పాటు చూస్తోన్న వాళ్ల‌కు కూడా నిద్ర దెబ్బ‌కు దూర‌మైపోయింది. ఈమె న‌డుము సోయ‌గాలు చూసి.. ఓరి బ్ర‌హ్మ‌దేవుడా ఎంత గొప్ప సొగ‌సురా అని పాడ‌కుంటే చూడండి..? ఈ వేడుక బాలీవుడ్ కు సంబంధించింది కావ‌డంతో అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోయింది త‌మ‌న్నా. అక్క‌డ ఈమె హొయ‌లు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. వాళ్ల ఆలోచ‌న‌లు అలాగే ఉండాల‌ని.. ఈ మ‌ధ్య అక్క‌డి వేడుక‌ల్లో రెచ్చిపోయి మ‌రీ అందాలు ఆర‌బోస్తుంది. బాహుబ‌లి త‌ర్వాత త‌మ‌న్నాకు బాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ వ‌చ్చేసింది. ఈ మ‌ధ్యే ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. దాంతో ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు ఈ మిల్కీ బ్యూటీ. పాల‌రాతి అందాల్ని అందంగా కెమెరాకు అరువిచ్చేసింది. మొత్తానికి త‌మ‌న్నా అందాలు ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here