దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్న హీరోయిన్ తమన్నా.

క్వీన్ రీమేక్ సెట్స్ లో  హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి  తెరకెక్కుతున్న  ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో  శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లో పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. చిత్ర బృందంతో పాటు హీరోయిన్ కాజల్, హీరోయిన్ తమన్నా పాల్గొనడం జరిగింది. ఈ మూవీ  తమిళ వర్షన్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో  నటిస్తోంది.
దర్శకుడు రమేష్ అరవింద్ కన్నడ, తమిళ్ వర్షన్ క్వీన్ రిమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సందర్భంగా హీరోయిన్ పరుల్ యాదవ్ మాట్లాడుతూ… ”ఇది నాకు స్పెషల్ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతి” అన్నారు. క్వీన్ తెలుగు రీమేక్ లో తమన్నా మెయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి “దటీజ్ మహాలక్ష్మి” పేరును ఖరారు చేసినట్లు తమన్నా తెలిపింది. 100% లవ్ చిత్రంలో తమన్నా పాత్ర పేరు “దటీజ్ మహాలక్ష్మి” తను మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి అదే టైటిల్ పెట్టడం ఆనందంగా ఉందని తమన్నా చెప్పడం జరిగింది.
నటీనటులు:
తమన్నా, సిద్దు జొన్నలగడ్డ, జి.వి.ఎల్.నరసింహ రావ్, మాస్టర్ సంపత్.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: అమిత్ త్రివేది.
కెమెరా మెన్: మిట్చెల్
కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్
నిర్మాత: మను కుమారన్
బ్యానర్: మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here