దర్శకేంద్రుడు మెచ్చిన ‘మళ్ళీరావా’

K Raghavendra Rao appreciates Malli Raava team
శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్ళీరావా’ ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మీడియాతో ఈ సినిమా గురించి ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ.. ”మళ్ళీరావా సినిమా ఇటీవలే చూశాను. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది.  సుమంత్ నటన నాకు బాగా నచ్చింది. అలాగే కెమెరా, సంగీతపరంగా అన్ని కొత్తగా అనిపించాయి. హీరోయిన్ నటనతో పాటు చిన్న పిల్లలు చాలా బాగా చేశారు. అలాగే ఫస్ట్ టైం దర్శకత్వం వహించిన గౌతమ్ కు, మరియు ఈ సినిమాతో నిర్మాతగా మారిన రాహుల్ యాదవ్ కి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఆందరూ చూడాల్సిన సినిమా…” అని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here