దస‌రాకు నంద‌మూరి వార్..


బాబాయ్ అబ్బాయి బాక్సాఫీస్ ను హీట్ ఎక్కించ‌డానికి మ‌ళ్లీ వ‌స్తున్నారు. వాళ్లు ఒక్క‌సారి క‌మిటైతే వాళ్ల మాట వాళ్లే విన‌రు. త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే అన్న‌ట్లుగా.. నంద‌మూరి హీరోలు సినిమాల విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం ఒక‌రి గురించి ఒక‌రు ఆలోచించ‌రు. ముఖ్యంగా ఎన్టీఆర్, బాల‌య్య అయితే స‌మ‌రానికి సై అంటూనే ఉంటారు.
బాబాయ్ అబ్బాయ్ పోరు అంటే చివ‌రి వ‌ర‌కు ఎవ‌రో ఒక‌రు వెన‌క్కి త‌గ్గుతారులే అనుకుంటే కూడా పొర‌పాటే. ఎందుకంటే రెండేళ్ల కింద సంక్రాంతికి నాన్న‌కు ప్రేమ‌తో, డిక్టేట‌ర్ ఒకేసారి రావ‌డంతో వాళ్లు పంతాల‌కు పోతున్నారనే విష‌యం అర్థ‌మైపోయింది. ఇక ఇప్పుడు కూడా మ‌రోసారి నంద‌మూరి వార్ చూడ‌బోతున్నాం. ద‌స‌రాకు ముందు అబ్బాయి..
పండ‌క్కి బాబాయ్ దుమ్ము లేప‌డానికి వ‌చ్చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ మొద‌లైంది. దీన్ని ఆర్నెళ్ల‌లో పూర్తి చేసి విడుద‌ల చేయాల్సిందిగా మాట‌ల మాంత్రికుడికి అల్టిమేటం వెళ్లిపోయింది. మ‌రోవైపు బాల‌య్య కూడా త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ను ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని చూస్తు న్నాడు. తేజ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ మే నుంచి మొద‌లు కానుంది. ఎట్టి ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్ ద‌స‌రాకు రావ‌డం ఖాయం. మ‌రోవైపు త్రివి క్ర‌మ్-ఎన్టీఆర్ సినిమా కూడా ద‌స‌రాకు క‌న్ఫ‌ర్మ్. ఇదే జ‌రిగితే పండ‌క్కి బాబాయ్ అబ్బాయ్ పోరు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here