దాచాల్సిన అవ‌స‌రం లేదంటున్న చిరంజీవి.. 

చిరంజీవి వ‌య‌సు 63.. సాధార‌ణంగా ఈ ఏజ్ లో ఉన్న వాళ్ల‌ను తాత‌య్య అంటారు. కానీ చిరంజీవిని మాత్రం తాత అన‌డానికి మ‌న‌సు రాదు. ఆయ‌న లుక్ అలా ఉంటుంది మ‌రి. ఇప్ప‌టికీ ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ తో కుర్రాళ్ల‌కు కూడా పిచ్చెక్కిస్తున్నాడు మెగాస్టార్. ఒక్క‌సారి సినిమాల్లోకి రావాల‌ని ఫిక్సైపోయిన త‌ర్వాత త‌న కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరంజీవి. ఒక‌ప్పుడు మ‌నం చూసిన చిరుకు.. ఇప్పుడు మ‌నం చూస్తున్న చిరుకు చాలా తేడా ఉంది. అప్ప‌ట్లో సినిమాలు చేసిన‌పుడు కూడా చిరు ఇంత ఫిట్ గా లేడు. కానీ ఖైదీ నెంబర్ 150 కోసం చాలా స‌న్న‌గా మారిపోయాడు. ఏకంగా హిట్ల‌ర్ టైమ్ లో ఉన్న చిరంజీవిలా క‌నిపించాడు.
ఇప్పుడు ఇప్పుడు సైరా కోసం మ‌రింత‌గా లుక్ మార్చేసాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్క‌నున్న చిత్రం కావ‌డంతో ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లు త‌న‌ను తాను సిద్ధం చేసుకుంటున్నాడు మెగాస్టార్. ఇప్పటికే సినిమా ప‌ట్టాలెక్కాల్సి ఉన్నా అనుకోని కార‌ణాల‌తో ఆల‌స్యం అవుతూనే ఉంది. ముఖ్యంగా చారిత్రాత్మ‌క పాత్ర కావ‌డంతో లుక్ విష‌యంలో ఎలాంటి విమ‌ర్శ‌లు రాకూడ‌ద‌ని ముందు నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు చిరు. సైరా సినిమా కోసం చిరు ఫిటెనెస్ లెవ‌ల్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా జీ గోల్డెన్ అవార్డ్స్ ఈవెంట్ కు వ‌చ్చిన చిరంజీవి.. త‌న లుక్ తో అక్క‌డున్న వాళ్లంద‌ర్నీ మెస్మ‌రైజ్ చేసాడు. కోర‌మీసాల‌తో కేక పెట్టించాడు. సైరా లుక్ విష‌యంలో దాచుకోడానికి ఏమీ లేద‌ని చెప్పేస్తున్నాడు చిరంజీవి. కాక‌పోతే సినిమా లుక్ ఎలా ఉంటుంద‌నే విష‌యంలో మాత్రం ఆస‌క్తి నెల‌కొంది.
మెగాస్టార్ మెగా లుక్ చూసి అక్క‌డున్న వాళ్లే కాదు.. అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఈ మ‌ధ్యే సైరా షూటింగ్ మొద‌లైంది. కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి లుక్ విడుద‌ల కాలేదు. ఇప్పుడు ఈయ‌న్ని చూస్తుంటే సినిమాలో ఎలా ఉండ‌బోతున్నాడో అర్థ‌మైపోతుంది. డిసెంబ‌ర్ 22 వ‌ర‌కు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్‌లో సినిమా మొదటి షెడ్యూల్ జరుగనుంది. నిర్మాత రామ్ చరణ్ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. 63 ఏళ్ల వ‌య‌సులోనూ ఈ పాత్ర కోసం అహ‌ర్నిష‌లు క‌ష్ట‌ప‌డుతున్నాడు మెగాస్టార్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు సరిపడా బాడీ షేప్‌ను చిరు ఇప్పటికే పొందినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు.. యుద్ధ విద్య‌లు, గుర్ర‌పుస్వారీ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నాడు చిరంజీవి. వీటితోపాటు క‌త్తిసాములోనూ ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడు మెగాస్టార్. మొత్తానికి 60 ఏళ్లు దాటిన త‌ర్వాత యోధుడిగా మార‌డానికి కంటిమీద కునుకు లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరు. మ‌రి ఈ క‌ష్టానికి ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here