దీపిక సినిమాలు మానేస్తుందా..?


ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు దీపిక తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఎప్పుడూ చేతిలో రెండు మూడు సినిమాల‌తో బిజీగా ఉండే దీపిక ప‌దుకొనే.. ప‌ద్మావ‌తి త‌ర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు న‌టిస్తున్న జీరో సైతం ఎప్పుడో ఓకే చేసిన ప్రాజెక్ట్. ఇందులో షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టిస్తుంది దీపిక‌. అనుష్క శ‌ర్మ మ‌రో హీరోయిన్. ఇదిలా ఉంటే ఇర్ఫాన్ ఖాన్ హీరోగా విశాల్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సైన్ చేసినా కూడా ఆయ‌న ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో అదిప్పుడు ఆగిపోయింది. దాంతో దీపిక జీరో త‌ప్ప మ‌రో సినిమా ఏదీ చేయ‌డం లేదు. ఉన్న‌ట్లుండి ఇలా సైలెంట్ అయిపోవ‌డం వెన‌క కార‌ణం ఆరా తీస్తే పెళ్లి చేసుకోవ‌డ‌మే అని కొంద‌రు అంటున్నారు. ర‌న్ వీర్ సింగ్ ను త్వ‌ర‌లోనే ఈమె పెళ్లి చేసుకోబోతుంది. ఇక దాంతోపాటు మెడనొప్పితో దీపిక బాధ ప‌డుతుంద‌ని.. అందుకే సినిమాలు ఒప్పుకోవ‌డం లేద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీపిక మేనేజ‌ర్ వ‌ర్గం మాత్రం ఇవేవీ స‌రైన కార‌ణాలు కావ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఆమె పెళ్లి చేసుకున్నా కూడా కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి ఆమె సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం మంచి క‌థ‌లు రాక‌పోవ‌డ‌మే అని తెలుస్తుంది. త‌న‌ను ఎగ్జైట్ చేసే క‌థ‌లు లేనందుకే దీపిక ఏ సినిమా ఒప్పుకోవడం లేద‌ని చెబుతున్నారు వాళ్లు. మ‌రి చూడాలిక‌.. ఈ ముద్దుగుమ్మ మ‌న‌సు గెలిచే క‌థ‌లు ఎక్క‌డున్నాయో ఏమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here