"దీర్ఝ ఆయుష్మాన్ భవ" మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన పూరీ జగన్నాధ్

Director-Puri-jagannath
వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి జంటగా జి.ప్రతిమ “దీర్ఘ ఆయుష్మాన్ భవ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూర్ణానంద్.ఎం దర్శకుడు.  మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. “కార్తీక్ రాజ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఒక డిఫరెంట్ ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైటిల్, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ సినిమాతో కార్తీక్ రాజ్ హీరోగా మంచి గుర్తింపు లభించాలని ఆశిస్తున్నాను” అన్నారు.
చిత్ర కథానాయకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ.. “హీరోగా నా గత చిత్రాల కంటే‌ వైవిధ్యంగా ఉండే సినిమా “దీర్ఝ ఆయుష్మాన్ భవ” డైరెక్టర్‌ పూర్ణానంద్‌గారు  ఓ గమ్మత్తెన ప్రేమకథగా రూపొందిస్తున్నారు. పూరీ జగన్నాధ్ గారు మా సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ మా సినిమాకి తప్పకుండా ఫలిస్తాయి” అన్నారు.
దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ.. ”ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తీస్తొన్న సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ “దీర్ఝ ఆయుష్మాన్ భవ”. సినిమా ఆద్యంతం  ఫ్రెష్‌ లుక్‌తో ఉంటుంది. సీనియర్ నటులు
 కైకాల సత్యనారాయణగారు చాలాకాలం తర్వాత యముడిగా కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. మార్చ్ లో సినిమాను విడుదల చెయనున్నాము. “దీర్ఝ ఆయుష్మాన్ భవ” అని టైటిల్ మా సినిమాకు పర్ఫెక్ట్ అని సినిమా చూసినవాళ్లే అంటారు” అన్నారు.
కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నొయల్, కైకాల సత్యనారాయణ, ఆమని,  పృథ్వీరాజ్‌, కాశి విశ్వనాధ్, సత్యం రాజేష్, తాగుబొతు రమేష్, గెటప్ శీను, రాంప్రసాద్, కేదార్ శంకర్, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ-కథనం-దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here