దేశ‌దిమ్మ‌రి కోసం త‌నీష్ గానం


యంగ్ హీరో త‌నీష్ దేశ‌దిమ్మ‌రి గా ముస్తాబౌతున్నాడు. స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి సార‌ధ్యంలో తెర‌కెక్కుతున్న దేశ‌దిమ్మ‌రిలో త‌నీష్ కు జోడీగా ష‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. స‌మ్మ‌ర్ కానుక‌గా మార్చ్ నెల‌లో విడుద‌ల‌కు ముస్తాబౌతున్న ఈ చిత్రం తాజాగా త‌న డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో త‌నీష్ త‌న‌లోని గాయ‌కుడిని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. హే పైసా అంటూ డ‌బ్బు పై వ‌చ్చే ఓ సెటైరిక‌ల్ సాంగ్‌ని త‌నీష్ స్వ‌యంగా ఆల‌పించాడు. ఈ చిత్రాన్ని పంజాబ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , హ‌ర్యానా, సిమ్లా వంటి అంద‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రించారు. దేశ‌దిమ్మ‌రి చిత్రానికి సుభాష్ ఆనంద్ అందించిన‌ సంగీతం , ప్ర‌దీష్ ఆంటోని కొరియోగ్ర‌ఫీ రెండు హైలైట్ గా ఉంటాయ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు న‌గేష్ నార‌దాసి చెప్పారు. ఈ చిత్రానికి నంద‌మూరి హ‌రి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌గా , మ‌ల్లిఖార్జున్ సినిమాటోగ్ర‌ఫీని అందించారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ముస్తాబౌతున్న త‌మ దేశ‌దిమ్మ‌రి చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు న‌గేష్ నారాదాసి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here