నమిత తో శరత్ బాబు మూడో పెళ్ళి

సీనియర్ తెలుగు నటుడు శరత్ బాబు మళ్ళి పెళ్ళి చేసుకోనున్నారట. మొదటి భార్య రమ్య ప్రభ తో విడాకుల తర్వాత శరత్ బాబు స్నేహ లతా అనే ఆమెను వివాహం చేసుకున్నారు. తాజా గా ఆయన మళ్ళి పెళ్ళి చేసుకోనున్నట్లు ప్రకటించారట. శరత్ బాబు నమిత ను పెళ్ళి చేసుకుంటారంటూ వార్త చెన్నై చిత్ర వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఆయన పెళ్లిచేసుకోబోయే నమిత నటి కాదని ఆమె ఓ జర్నలిస్ట్ అని తెలుస్తుంది. అరవయ్యేళ్ల శరత్ బాబు కంటే ఆమె 25 సంవత్సరాలు చిన్నదట. శరత్ బాబు ఇది కథ కాదు, ముత్తు వంటి చిత్రాలతో తమిళ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.