నాందా.. కాలా క‌రికాల‌న్ డా.. 

కాలా.. ఇప్పుడు ర‌జినీ అభిమానుల‌కు ఈ పేరు ఓ తార‌క‌మంత్రం. ఎప్పుడెప్పుడు ఎప్రిల్ వ‌స్తుందా.. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేచి చూస్తున్నారు వాళ్లు. అంతేకదా మ‌రి.. 2017లో రోబో 2 వ‌స్తుందనుకుంటే హ్యాండిచ్చాడు శంక‌ర్. దాంతో ఇప్పుడు కాలాపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నారు వాళ్లు. అభిమానుల వేద‌న‌ను అర్థం చేసుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు కాలా టీజ‌ర్ విడుద‌ల తేదీ బ‌య‌టికి వ‌చ్చింది. మార్చ్ 10న ఈ చిత్ర టీజర్ విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. అయితే దీనిపై చిత్ర‌యూనిట్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌క‌పోయినా.. క‌చ్చితంగా ఆ రోజు టీజ‌ర్ వ‌చ్చే సూచ‌న‌లైతే క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే టీజ‌ర్ కు సంబంధించిన వ‌ర్క్ కూడా పూర్తైపోయింద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇందులో ర‌జినీ డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసాడు.
ఇక సినిమా విడుద‌ల కావ‌డ‌మే త‌రువాయి. అయితే ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో బిజీగా ఉంది సినిమా. ఎప్రిల్ 27న సినిమా విడుద‌ల కానుంది. ఈ ఏజ్ లోనూ సూప‌ర్ స్టైలిష్ గా క‌నిపిస్తూ మాయ చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. రంజిత్ తెర‌కెక్కిస్తోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో నానా ప‌టేకార్.. హ్యూమా ఖురేషీ లాంటి బాలీవుడ్ న‌టులు ఉన్నారు. ఇందులో మ‌రోసారి మాఫియా డాన్ గానే న‌టిస్తున్నాడు ర‌జినీకాంత్. ప్ర‌స్తుతం చెన్నై శివార్ల‌లో ముంబైలోని కీల‌క‌మైన ఏరియా ధారావి సెట్ లోనే షూటింగ్ 70 శాతం జ‌రిగింది. ధ‌నుష్ తొలిసారి మావ‌య్య హీరోగా నిర్మిస్తోన్న సినిమా ఇది. మొత్తానికి చూడాలిక‌.. కాలా క‌రికాల‌న్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here