నాగార్జున‌కు రుణ‌ప‌డిపోయిన విశాల్..


అవును.. ఇప్పుడు నిజంగానే నాగార్జున‌కు భారీగా రుణ‌ప‌డిపోయాడు విశాల్. ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో అంతే మ‌రి. ఓ చెత్త సినిమా ప‌డిన‌పుడే క‌దా.. మంచి సినిమా విలువ తెలుస్తుంది. ఆఫీస‌ర్ రూపంలో దారుణ‌మైన డిజాస్ట‌ర్ ఇచ్చాడు నాగార్జున‌. ఈ చిత్రానికి రెండో రోజు కూడా లేదు. కామ‌న్ గా మూడు రోజుల వ‌సూళ్లు అంటారు కానీ ఆఫీస‌ర్ మాత్రం తొలిరోజే చివ‌రి రోజు అయిపోయింది. అంత దారుణంగా ఉంది ప‌రిస్థితి. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. దాంతో ఆఫీస‌ర్ కు పోటీగా వ‌చ్చిన అభిమ‌న్యుడు కుమ్మేస్తున్నాడు. మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 4 కోట్ల షేర్.. 6.50 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.
ఓ డ‌బ్బింగ్ సినిమాకు ఇంత వ‌సూళ్లు రావ‌డం మాత్రం నిజంగా అద్భుత‌మే. పైగా ఇది విశాల్ కు సొంత రిలీజ్. దాంతో వ‌చ్చేది అంతా మిగిలేది అని అర్థం. చాలా ఏళ్లుగా విశాల్ వ‌ర‌స సినిమాల‌తో వ‌స్తున్నాడు కానీ నిల‌బ‌డ్డం లేదు. కొన్ని సినిమాల‌కు మంచి టాక్ వ‌చ్చినా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌లేదు. కానీ ఈ సారి మాత్రం ఆ కోరిక తీరింది.. అభిమ‌న్యుడుతో భారీ విజ‌యం దిశ‌గా అడుగేస్తున్నాడు విశాల్. ఈ సినిమా జోరు చూస్తుంటే ఈజీగా ఇక్క‌డ 6-8 కోట్ల మ‌ధ్య వ‌సూలు చేసేలా ఉంది. ఇదే జ‌రిగితే విశాల్ పంట పండిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here