నాగార్జున సినిమాపై రాజ‌మౌళి క‌న్ను..

NAGARJUNA RAJAMOULI
విన‌డానికి కాస్త వింత‌గా ఉన్నా కూడా ఇదే నిజం. నిజంగానే నాగార్జున సినిమాపై ఇప్పుడు రాజ‌మౌళి క‌న్నేస్తున్నాడు. అది కూడా ఫ్లాప్ సినిమాపై. బాహుబ‌లి 2 త‌ర్వాత రాజ‌మౌళి రేంజ్ ఎక్క‌డుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమా అంటే దేశవ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తుంది. బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు బోలెడు వ‌స్తున్నా కూడా తెలుగులోనే మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక్క‌డ భారీ మ‌ల్టీస్టార‌ర్ కు తెర తీస్తున్నాడు. తొలిసారి ఒకే ఇమేజ్ ఉన్న ఇద్ద‌రు కుర్ర హీరోల‌ను క‌లిపి చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప్ర‌స్తుతం వేగంగా జ‌రుగుతుంది. ఈ అక్టోబ‌ర్ లో సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే క‌థ కూడా పూర్తైపోయింది. ప్ర‌స్తుతం తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ తో క‌లిసి క‌థా చ‌ర్చ‌ల్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి.
ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి నాగార్జున పాత సినిమా టైటిల్ ఒక‌టి ప‌రిశీలిస్తున్నారు. అది కూడా ఫ్లాప్ సినిమా టైటిల్. అదే ఇద్ద‌రూ ఇద్ద‌రే. అప్ప‌ట్లో తండ్రి నాగేశ్వ‌ర‌రావ్ తో క‌లిసి నాగార్జున న‌టించిన సినిమా ఇది. ఓన‌మాలు నేర్పించాల‌ని పాట ఈ సినిమాలోనిదే. ఈ టైటిల్ అయితే ఇప్పుడు తాను చేయ‌బోయే సినిమాకు ప‌ర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ని భావిస్తున్నాడు రాజ‌మౌళి. యూనిట్ కూడా ఇదే టైటిల్ వైపు మొగ్గు చూపుతుంది. దాంతో ప‌ట్టాలెక్క‌క ముందే ఈ చిత్ర టైటిల్ ప‌క్కా అయిపోయేలా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక.. మెగా నంద‌మూరి వారి ఇద్ద‌రూ ఇద్ద‌రే ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here