నాగ్ సినిమా పేరేంటో తెలుసా..? 

NagRGV4
నాగార్జున ప్ర‌స్తుతం వ‌ర్మ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 24 ఏళ్ళ త‌ర్వాత మ‌రోసారి వ‌ర్మ‌ను న‌మ్మాడు ఈ హీరో. ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాడ‌నే ఆశ‌తో ఉన్నాడు నాగార్జున‌. కానీ వ‌ర్మ మాత్రం పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ విచిత్రంగా ఇప్పుడు నాగార్జున‌తో వ‌ర్మ చేస్తోన్న సినిమా కూడా పోలీస్ బ్యాక్ డ్రాప్ కావ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది. కానీ వ‌ర్మ మాత్రం హైద‌రాబాద్ లో ఉన్నాడు. మార్చ్ 30 లోపు త‌న సినిమా పూర్తి చేయాల‌నేది వ‌ర్మ‌కు నాగార్జున పెట్టిన కండీష‌న్. ఇది పూర్తి చేస్తానంటూ స్నేహితుడికి మాట కూడా ఇచ్చాడు వ‌ర్మ‌. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఏంట‌నే విష‌యంపై ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు అభిమానుల్లో కూడా చ‌ర్చ‌లు బాగానే న‌డుస్తున్నాయి. దీనికి ఒక‌టి రెండు కాదు.. ఏకంగా మూడు టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. గ‌న్ అంటూ ప‌ర్ ఫెక్ట్ మ‌సాలా టైటిల్ ఒక‌టి సిద్ధంగా ఉంటే.. సిస్ట‌మ్ అంటూ వ‌ర్మ స్టైల్ లో మ‌రో టైటిల్ కూడా ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ఇక మూడోది శ‌ప‌థం. ఇది పూర్తిగా వ‌ర్మ స్టైల్ కు భిన్న‌మైన టైటిల్. కానీ క‌థ‌కు త‌గ్గ టైటిల్ ఇదే అంటున్నారు. ఈ సినిమా అంతా నాగార్జున న‌ట విశ్వ‌రూపం చూస్తారంటున్నాడు వ‌ర్మ‌. శ‌ప‌థం చేసి మ‌రీ స‌మాజంలో ఉన్న చెడును నిర్మూలించ‌డానికి త‌న హీరో ప్ర‌య‌త్నిస్తుంటాడు అని చెబుతున్నాడు వ‌ర్మ‌. మ‌రి ఈ మూడు టైటిల్స్ లో ఏది ప‌ర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ని నాగ్ భావిస్తాడో చూడాలిక‌. ఎప్రిల్ చివ‌ర్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here