నాగ‌శౌర్య మ‌రో ఉద‌య్ కిర‌ణ్ కాడు క‌దా..!


అదేంటి.. ఉద‌య్ కిర‌ణ్ తో నాగ‌శౌర్య‌కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఉంది.. క‌చ్చితంగా ఉంది.. కాలం క‌నిక‌రిస్తే అప్పుడు ఉద‌య్ చేయ‌లేని ఓ ప‌ని ఇప్పుడు నాగ‌శౌర్య చేసేలా క‌నిపిస్తున్నాడు. అస‌లు విష‌యం ఏంటంటే.. నాగ‌శౌర్య మెగా ఇంటి అల్లుడు కానున్నాడ‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. కొణిదెల నిహారిక‌తో ఈ కుర్ర హీరో ప్రేమ‌లో ఉన్నాడ‌నే వార్త‌లు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రూ క‌లిసి గ‌తంలో ఒక మ‌న‌సు సినిమాలో న‌టించారు. అప్పుడే ఒక‌రి మ‌న‌సులు మ‌రొక‌రు ఇచ్చి పుచ్చుకున్నార‌ని తెలుస్తుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా.. వీళ్ల ప్రేమాయ‌ణం మాత్రం సూప‌ర్ హిట్ అయింద‌నే వార్త‌లున్నాయి. ఆ ప‌రిచ‌యం ఇప్ప‌టికీ ఇలాగే ఉంద‌ని.. శౌర్య‌తో నిహారిక ఇప్ప‌టికీ చ‌నువుగానే ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.
ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ను మెగా కుటుంబం కూడా అర్థం చేసుకుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముందు ఈ ఇద్ద‌రి ప్రేమ‌కు నాగ‌బాబు నో చెప్పినా.. చిరంజీవి న‌చ్చ చెప్ప‌డంతో నాగ‌శౌర్య మెగా ఇంటి అల్లుడుగా వ‌స్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మొన్న త‌న త‌ల్లితో వెళ్లి చ‌లో ప్రీ రిలీజ్ కు పిలిచిన వెంట‌నే చిరంజీవి రావ‌డానికి.. అక్క‌డ నాగ‌శౌర్య గురించి అంత‌గా పొగ‌డ‌టానికి కూడా కార‌ణం ఇదే అని తెలుస్తుంది. అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ ను త‌న పెద్ద‌కూతురు సుస్మిత‌కు ఇవ్వాల‌నుకున్నాడు చిరంజీవి. కానీ నిశ్చితార్థం అయిన త‌ర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు నాగ‌బాబును అలా చేయొద్దని చెబుతున్నాడు చిరు. స‌రిగ్గా అవ‌కాశాలిస్తే నాగ‌శౌర్య కూడా పెద్ద హీరో అవుతాడ‌ని ఛ‌లో ప్రీ రిలీజ్ వేడుక‌లో చెప్పాడు చిరు. మ‌రి చూడాలిక‌.. నిజంగానే శౌర్య మెగా ఇంటి అల్లుడు కాబోతున్నాడేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here