నానా ప‌టేకర్.. నువ్వు తోపు రాజా..!

ఇండియాలో ఉన్న గొప్ప న‌టుల జాబితా తీస్తే అందులో టాప్ 10లో ఉండే పేరు నానా ప‌టేకర్. ఎన్నో సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించిన ఈ లెజెండ‌రీ యాక్ట‌ర్.. ఇప్పుడు సౌత్ సినిమాల్లోకి కూడా వ‌చ్చాడు. కాలాలో ర‌జినీకి పోటీగా త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు. పోటీగా కాదు.. ఇంకా చెప్పాలంటే నానా ఉన్న సీన్స్ లో ర‌జినీ కూడా క‌నిపించ‌లేదంటే అతిశ‌యోక్తి కాదేమో..?

మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్ లో నానా ప‌టేక‌ర్ ఇంటికి ర‌జినీ వ‌చ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ ఒక‌టి ఉంటుంది. ప‌ది నిమిషాల పాటు సాగే ఆ సీన్ లో పూర్తిగా ర‌జినీకాంత్ ను డామినేట్ చేసాడు నానా. త‌న ఎక్స్ ప్రెష‌న్స్ తో ఆ సీన్ ను ర‌క్తి క‌ట్టించాడు. ఇద్ద‌రు లెజెండ్స్ ఒకే సీన్ లో చిరుతల్లా కెమెరా ముందు పోట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఆ సీన్ చూస్తే అర్థ‌మైపోతుంది. అంతేకాదు.. కాలాలో నానా ప‌టేక‌ర్ ఎంట్రీ త‌ర్వాత రేంజ్ మారిపోతుంది.

సినిమా సోసోగా ఉన్నా కూడా నానా మాత్రం బ్లాక్ బ‌స్ట‌రే. ఈ చిత్రం ఏ మాత్రం క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అయినా అందులో ర‌జినీ పాత్ర ఎంత ఉందో.. నానా కూడ అంతే అని మ‌రిచిపోకూడ‌దు. తాను రాసుకున్న ఈ రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర కోసం నానా ప‌టేక‌ర్ ను తీసుకోవ‌డం రంజిత్ తీసుకున్న అద్భుత‌మైన నిర్ణ‌యం. మొత్తానికి కాలా త‌ర్వాత ఇప్పుడు సౌత్ లో నానాకు అవ‌కాశాలు పెరిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here