నానితో కొర‌టాల ఎప్పుడు..?

 
Nani
నాని సినిమాల లిస్ట్ చూస్తుంటే ఇప్పుడు చాంతాడంత అవుతుంది. మ‌నోడు ప‌ని చేస్తున్న సినిమాలు అలా ఉన్నాయి మ‌రి. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంతో బిజీ. ఇది ఎప్రిల్ 12న విడుద‌ల కానుంది. ఇది విడుద‌ల‌వ్వ‌క ముందే నాగార్జున‌తో సినిమా మొద‌లుపెట్టాడు నాని. శ్రీ‌రామ్ ఆదిత్య దీనికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర షూటింగ్ కూడా ఇదే ఏడాది పూర్తి కానుంది. సినిమాను ఆగ‌స్ట్ లేదంటే సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక ఈ సినిమా త‌ర్వాత హ‌ను రాఘ‌వ‌పూడి.. విక్ర‌మ్ కే కుమార్ ల‌తో సినిమాలు ఉంటాయ‌ని చెప్పాడు నాని. ఈ రెండు సినిమాలే కాదు.. ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల కూడా నానికి క‌థ చెప్పి ఒప్పించాడు. ఇంత‌మంది ఉండ‌గా ఇప్పుడు కొర‌టాల కూడా నాని ద‌ర్శ‌కుల లిస్ట్ లో చేరిపోయాడు. ఈ కాంబినేష‌న్ పై ఇటు కొర‌టాల కానీ.. అటు నాని గానీ మాట్లాడ‌లేదు కానీ ఈ ఇద్ద‌ర్ని క‌లిపేస్తూ ఈ మ‌ధ్యే అనౌన్స్ మెంట్ అయింది వ‌చ్చింది. వంశ ధార ప్రొడ‌క్ష‌న్స్ లో మిక్కిలినేని సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే కొర‌టాల శివ ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేనుతో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో కూడా సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు నాని స‌డ‌న్ గా సీన్ లోకి వ‌చ్చాడు. మ‌రి ఆ సినిమాలు ఇప్పుడు ఉండ‌వా.. లేదంటే నాని సినిమానే ప‌క్క‌న‌బెట్టేస్తాడా.. ఏదో ప్ర‌స్తుతానికైతే కావాల్సినంత క‌న్ఫ్యూజ‌న్ ఉంది ఈ కాంబినేష‌న్ పై. చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here