నానిని వేస్ట్ ఫెలో అనేసిన హీరో..

Siddharth-Comments-on-Nani

నాని అంటే ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ హిట్  మిష‌న్. ఈయ‌న సినిమా చేస్తే హిట్ అనే మాట త‌ప్ప మ‌రోటి వినిపించ‌దు. ఇప్పుడు విడుద‌లైన ఎంసిఏ సైతం టాక్ తో ప‌నిలేకుండా క‌లెక్ష‌న్లు కుమ్మేస్తుంది. ఇప్ప‌టికే రెండు రోజుల్లోనే 12 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఆ చిత్రం. ఇలాంటి హీరోను ఒక్క మాట అనాల‌న్నా ఎవ‌రైనా ఆలోచిస్తారు. కానీ ఓ హీరో మాత్రం నానిని వేస్ట్ ఫెలో అనేసాడు. అస‌లు అంత ధైర్యం చేసిన హీరో ఎవ‌రా అనుకుంటున్నారా.. అత‌డే సిద్ధార్థ్. అవును.. నిజంగానే సిద్ధూ న్యాచుర‌ల్ స్టార్ ను వేస్ట్ ఫెలో అన్నాడు. తాజాగా నాని నిర్మిస్తున్న అ..! చిత్రంలోని చేప లుక్ విడుద‌లైంది. ఈ చేప నాని అన్న‌మాట‌. ఈగ త‌ర్వాత ఇప్పుడు చేప అయిపోయాడు నాని. ఈ లుక్ చూసిన వెంట‌నే త్వ‌ర‌గా సినిమా విడుద‌ల చేయ్ సోద‌రా అంటూ ట్వీటేసాడు సిద్ధార్థ్. ఈ చిత్రంలో ఇలాంటి పాత్ర వ‌స్తే మీరు చేస్తారా అని ఓ ఫ్యాన్ సిద్ధార్థ్ ను అడిగాడు. దానికి స‌మాధానం ఇస్తూ.. నేను సిద్ధంగానే ఉన్నా.. కానీ ఆ నిర్మాత వేస్ట్ ఫెలో.. నాకు ఛాన్స్ ఇవ్వ‌లేదన్నాడు. సోష‌ల్ మీడియాలో అంత మంది ముందు నానిని వేస్ట్ ఫెలో అన్నాడంటే సిద్ధార్థ్.. నాని ఎంత మంచి స్నేహితులో అర్థ‌మైపోతుంది. అన్న‌ట్లు ఈ మ‌ధ్యే గృహం సినిమాతో సిద్ధూ తెలుగులోనూ ఫామ్ లోకి వ‌చ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here