నాని ఏం చేద్దాం ఇప్పుడు మ‌రి..?

SRI REDDY NANI IN BIG BOSS 2

ఈ మాట అంటున్నది మ‌నం కాదండీ బాబూ..! నానిని ఇంకొక‌రు అడిగిన ప్ర‌శ్న ఇది. ఇంత‌కీ ఎవ‌రా వ్య‌క్తి అనుకుంటున్నారా… ఇంకెవ‌రు ఉన్నారు క‌దా తెలుగులో కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ శ్రీ‌రెడ్డి. కొన్ని నెల‌లుగా టాలీవుడ్ లో ఈమె పేరు ఓ సంచ‌ల‌నం. అంత సీన్ లేదు కానీ కొంద‌రు కావాల‌నే ఈమెను సంచ‌ల‌నంగా మార్చేసారు. మీడియా వాళ్లు కూడా స‌రిగ్గా గుర్తుప‌ట్ట‌ని ఈమె మొహాన్ని ఓ రెండు ఛానెల్స్ ప్ర‌త్యేకంగా ద‌త్త‌త తీసుకుని మ‌రీ క్రేజ్ పెంచేసాయి.

ఇక ఇప్పుడు ఈ భామ‌ను బిగ్ బాస్ సీజ‌న్ 2 కు ఎంపిక చేసార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ దీనిపై కాస్త అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. త‌న ఫేస్ బుక్ లో అమ్మ‌డు పోస్ట్ చేస్తున్న విధానం చూసి ఈమె కూడా బిగ్ బాస్ కు సెలెక్ట్ అయింద‌నే వార్త‌లు క‌న్ఫ‌ర్మ్ అయిపోతున్నాయి. అస‌లే నాకు నానికి ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది.. నాని మ‌రి ఏం చేద్దాం ఇప్పుడు అంటూ పోస్ట్ చేసింది.

దీన్నిబ‌ట్టి బిగ్ బాస్ హౌజ్ లోకి శ్రీ‌రెడ్డి కూడా వెళ్తుంద‌ని అర్థ‌మైపోతుంది. ఎందుకంటే సీజ‌న్ 2కు ఈయ‌నే హోస్ట్ క‌దా..! మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు నానిపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ‌రెడ్డి.. ఇప్పుడు ఒకే స్టేజ్ పై ఎలా ఎదురుప‌డ‌బోతున్నారు అనేది మాత్రం నిజంగా స‌స్పెన్స్ కా మమ్మీనే. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here