నాని కూడా మారిపోతున్నాడా..?

MCA Nani Interview Photos
తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న అతికొద్ది మంది న‌టుల్లో నాని కూడా ఒక‌రు. ఈయ‌న సినిమా చేసాడంటే క‌చ్చితంగా అందులో ఏదో కొత్తద‌నం ఉంటుంద‌ని న‌మ్ముతున్నారు ప్రేక్ష‌కులు. అందుకే నానికి వ‌ర‌స విజ‌యాలు వ‌స్తున్నాయి. ఒక్కోసారి యావ‌రేజ్ గా ఉన్న సినిమాలు కూడా సూప‌ర్ హిట్ లు అవుతున్నాయి. నేనులోక‌ల్ సినిమా ఇలా వ‌చ్చిందే. నేనులోక‌ల్ ఆడింద‌నే న‌మ్మ‌క‌మో లేదంటే ఎలా ఉన్నా ప్రేక్ష‌కులు చూస్తున్నారన్న అతి విశ్వాస‌మో ఏమో కానీ ఇప్పుడు నాని కూడా మారిపోతున్నాడు. తాను కూడా అంద‌ర్లాంటి హీరోనే అని నిరూపించుకుంటున్నాడు. రొటీన్ రూట్ ని వెతుక్కుంటూ మ‌రీ వ‌స్తున్నాడు. ఇప్పుడు విడుద‌లైన మిడిల్ క్లాస్ అబ్బాయి ప‌ర‌మ రొటీన్ క‌థ‌తో తెర‌కెక్కింది. నాని, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ.. ఫ‌స్టాఫ్ లో భూమిక‌తో వ‌చ్చే సీన్స్ అన్నీ సినిమాను కాపాడాయి కానీ లేక‌పోతే ప‌రిస్థితి మ‌రోలా ఉండేదేమో..? అయినా సెకండాఫ్ మాత్రం గాడి త‌ప్పింది. రొటీన్ క‌థ‌ను పాపం సాయిప‌ల్ల‌వి, నాని అయినా ఎంత‌సేపు మోస్తారు..? అందుకే సెకండాఫ్ లో క‌థ పూర్తిగా గాడి త‌ప్పింది. క్లైమాక్స్ వ‌ర‌కు అటూ ఇటూ ఎటూ సాగుతూనే ఉంది. ఓవ‌రాల్ గా ఇప్పుడు ఓపెనింగ్స్ వ‌ర‌కు ఓకే కానీ చివ‌రి వ‌ర‌కు మాత్రం ఎంసిఏ మిగులుతాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు నాని కూడా ఇలాంటి రొటీన్ క‌థ‌లు చేస్తుండ‌టం అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. మ‌రి చూడాలిక‌.. నాని మ‌ళ్లీ త‌న రూట్ లోకి ఎప్పుడొస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here