నాని జోరుకు బ్రేకులు ప‌డ్డ‌ట్లేనా..?

Nani
ఇండ‌స్ట్రీలో వ‌ర‌స విజ‌యాలు వ‌స్తే చూడ్డానికి హ్యాపీగానే ఉంటుంది కానీ చాలా మంది తెలియ‌కుండా కుళ్లుకుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. నానికి ఒక్క ఫ్లాప్ వ‌స్తే చూడాల‌ని చాలా మంది చాలా కాలంగా వేచి చూస్తున్నారు. కానీ ఈయ‌న అదృష్ట‌మేంటో కానీ మూడేళ్ల నుంచి వ‌ర‌స‌గా కుమ్మేస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఈ జోరుకు బ్రేకులు ప‌డేలా క‌నిపిస్తున్నాయి. తాజాగా విడుద‌లైన కృష్ణార్జున యుద్ధం సినిమాకు టాక్ తేడాగా వ‌చ్చేసింది. ఎంసిఏకు కూడా ఇలాగే వ‌చ్చింది కానీ క‌లెక్ష‌న్ల విష‌యంలో ఆ తేడా క‌నిపించ‌లేదు. కానీ కృష్ణార్జున యుద్ధం విష‌యంలో క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం దారుణంగా దెబ్బ‌తింది. ఎంసిఏ 3 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగా వ‌సూలు చేస్తే.. ఈ చిత్రం కేవ‌లం ల‌క్ష 60 వేల డాల‌ర్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది.
దీన్నిబ‌ట్టే తెలుస్తుంది కృష్ణార్జున యుద్ధం ప‌రిస్థితి ఏంటో..? ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నాని జోరుతో ఇక్క‌డ బాగానే వ‌సూలు చేస్తుంది సినిమా. కానీ ఫుల్ ర‌న్ లో సేఫ్ అవుతుందా లేదా అనేది మాత్రం కాస్త అనుమానంగా ఉంది. ఈ తీరు చూస్తుంటే నానికి చాలా కాలం త‌ర్వాత కాస్త లాస్ వెంచ‌ర్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. మ‌రి ఈ టాక్ తో ట్రిపుల్ హ్యాట్రిక్ అందుకుంటాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here