నాని దొంగత‌నాలు చేస్తున్నాడా..?

NANI IN RANA PLACE

వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్నాడు.. పైగా కోట్ల‌కు కోట్ల రెమ్యున‌రేష‌న్ వ‌స్తుంది.. పైగా ఇప్పుడు బిగ్ బాస్ కూడా చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఈయ‌న‌కు దొంగ‌త‌నాలు చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ఎంతైనా సినిమా హీరోలు క‌దా.. ఏదైనా చేయాల్సిందే. పాత్ర‌లు డిమాండ్ చేసిన‌పుడు ఏం చేయ‌కుండా ఉంటే ఎలా..? ఇప్పుడు నాని కూడా అందుకే దొంగ అవుతున్నాడ‌ని తెలుస్తుంది.

ఈయ‌న ప్ర‌స్తుతం శ్రీ‌రామ్ ఆదిత్య సినిమాతో పాటు బిగ్ బాస్ సీజ‌న్ 2 ఒప్పుకున్నాడు. జూన్ 10 నుంచి ఇది ప్రారంభం కానుంది. దాంతో పాటే ఇప్పుడు మ‌రో సినిమాకు నాని సై అన్నాడ‌ని తెలుస్తుంది. అదే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావ్ బ‌యోపిక్. ఒక‌ప్పుడు స్టువ‌ర్టుపురంను గ‌డ‌గ‌డ‌లాడించిన పేరు ఇది. చివ‌రికి పోలీస్ ఎన్ కౌంట‌ర్ లో ఈయ‌న చ‌నిపోయాడు. ఈయ‌న క‌థ‌ను తెర‌పైకి తీసుకురావాల‌ని ఏకే ఎంట‌ర్ టైన్మెంట్స్ అనిల్ సుంక‌ర ఆరాట‌ప‌డుతున్నాడు.

కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త ఫేమ్ వంశీకృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ముందు రానాను అడిగితే ఆయ‌న ఓకే అన్నాడు కూడా. కానీ ఆ త‌ర్వాత ఇత‌ర ప్రాజెక్టుల‌తో పాటు త‌న‌కు కంటి ఆప‌రేష‌న్ ఉంది క‌దా వాట‌న్నింటి మ‌ధ్య డేట్స్ క్లాష్ వ‌స్తుంద‌ని ఈ చిత్రాన్ని వ‌దిలేసుకున్నాడు రానా. దాంతో ఇప్పుడు నాని ద‌గ్గ‌రికి ఈ క‌థ వెళ్లింద‌ని తెలుస్తుంది. నాని కూడా ఈ బ‌యోపిక్ పై ఆస‌క్తిగానే క‌నిపిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here