నాని న్యూ లుక్ భ‌లేభ‌లే..


నాని అంటే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది గ‌డ్డంతో ఉన్న లుక్. ఆయ‌న్ని ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు. ఫ‌స్ట్ సినిమా నుంచే తెలియ‌కుండా గ‌డ్డానికి అలవాటు ప‌డిపోయాడు న్యాచుర‌ల్ స్టార్. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఒక‌ట్రెండు సినిమాల‌కు తీసేయ‌డం మిన‌హాయిస్తే.. అన్ని సినిమాల్లోనూ ఓకే లుక్ తో క‌నిపిస్తుంటాడు నాని. ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన కృష్ణార్జున యుద్ధంలోనూ ఇలాగే ఉన్నాడు నాని. కానీ చాలా ఏళ్ళ త‌ర్వాత న్యూ లుక్ ట్రై చేసాడు ఈ హీరో. తాజాగా ఈయ‌న నాగార్జున‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్నాడు నాని. షూటింగ్ కూడా మొద‌లైపోయింది. ఇందులో కొత్త నాని క‌నిపించ‌బోతున్నాడు. తాజాగా కృష్ణార్జున యుద్ధం ప్రెస్ మీట్ కు వ‌చ్చిన నానిని చూసి అంతా షాక్ అయ్యారు. మీసాలు మాత్ర‌మే ఉండి.. గడ్డం గాలికి ఎగిరిపోయింది. ఇందులో నాని డాక్ట‌ర్ గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. పూర్తిస్థాయి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అశ్వినీద‌త్ నిర్మాత‌. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. ఇందులో హీరోయిన్లు ఎవ‌రో ఇంకా ఫైన‌ల్ కాలేదు. నానికి జోడీగా మాళ‌విక శ‌ర్మ న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. ఇక నాగార్జున‌కు జోడీగా అనుష్క పేరు ప‌రిశీలిస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. ఈ న్యూ లుక్ తో నాని ఏం మాయ చేయ‌బో తున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here