నాని-సాయిప‌ల్ల‌వి.. రొమాన్స్ అదిరింది గురూ..!

Natural Star Nani's ‘MCA’ Shoots In Spain
పోటీకైనా.. యుద్ధానికైనా స‌మవుజ్జీలు ఉండాలి. ఇన్నాళ్లూ నాని విష‌యంలో అది లేదు. ఈయ‌న త‌న న‌ట‌న‌తో త‌నతో న‌టించే ముద్దుగుమ్మ‌ల‌ను పూర్తిగా తినేసాడు. వాళ్ల‌ను క‌న‌బ‌డ‌కుండా చేసాడు. కానీ ఇన్నాళ్ల‌కు నానికి కూడా తిప్ప‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే అక్క‌డ ఉన్నది త‌న‌లాగే ఓ న్యాచుర‌ల్ యాక్ట‌ర్ కాబ‌ట్టి. ఆమే సాయిప‌ల్ల‌వి. ఆ సినిమా ఎంసిఏ. ఈ చిత్రంలోని ఒక్కోపాట‌.. స్టిల్ విడుద‌ల‌వుతున్న కొద్దీ అంచ‌నాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. ఇద్ద‌రు న్యాచుర‌ల్ యాక్ట‌ర్స్ తెర‌పై క‌నిపిస్తే ఎలా ఉంటుందో ఎంసిఏ సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. అన్నింట్లోనూ సాయిప‌ల్ల‌వి, నాని మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. మొన్న విడుద‌లైన పాట‌లో అయితే ఇద్ద‌రూ ఆక‌ట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏమయిందో నాకు అనే పాట‌లో కూడా ఈ ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ అదిరిపోయింద‌ని ఒక్క పోస్ట‌ర్ తోనే సీన్ అర్థ‌మైపోయింది. డిసెంబ‌ర్ 9 సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ పాట విడుద‌ల కానుంది.
ఇప్ప‌టికే విడుద‌లైన ఎంసిఏ టైటిల్ సాంగ్ అద‌ర‌గొడుతుంది. ఎక్క‌డ విన్నా.. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం అంటూ పాడేస్తున్నారు కుర్రాళ్లు. ఇక
మొన్న విడుద‌లైన కొత్త‌గా కొత్త‌గా సాంగ్ కూడా చాలా పెద్ద హిట్టైంది. సాగ‌ర్ ఎన‌ర్జిటిక్ వాయిస్.. ప్రియా హిమేష్ రొమాంటిక్ స్వ‌రం రెండూ క‌లిసి ఈ పాట‌ను బాగానే మెస్మ‌రైజ్ చేసాయి. ఇక నాని, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఇక ఇప్పుడు రాబోతున్న పాట‌పై కూడా ఆస‌క్తితో పాటు అంచ‌నాలు కూడా చాలా ఉన్నాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి బంధాలు, అనుబంధాలే మెయిన్ బేస్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్. మొత్తానికి ఎంసిఏ మ్యూజిక్ ప‌రంగా సూప‌ర్ హిట్. పూర్తిపాట‌లు డిసెంబ‌ర్ 11న విడుద‌ల కానున్నాయి.. అదే రోజు ట్రైల‌ర్ కూడా రానుంది. డిసెంబ‌ర్ 21న సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here