నాన్నగారి పుట్టినరోజు వరుకు షేర్స్ ఇలానే చెప్పుతుండాలి – మహేష్ బాబు

 

భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా నేడు చిత్ర బృందం సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. చిత్రంలో నటించిన నటి నటులు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ ప్రధానోత్సవం చేసారు. భరత్ అనే నేను 160 కోట్ల గ్రాస్ కల్లెక్ట్ చేసిందని, ఇది ఫేక్ కాదని నిర్మాత డి వి వి దానయ్య అన్నారు.
మంచి స్క్రిప్ట్ కి సూపర్ స్టార్డం తోడైతే ఎంతటి ఘనవిజయం సాధించ వచ్చో ఈ సినిమా నిరూపించింది, మేము మంచి సినిమాలు తీస్తాం అని సగర్వంగా భరత్ దేశం అంతటా చాటి చెప్పింది. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలి – రామ్ జోగయ్య శాస్త్రి
సూపర్ స్టార్ మహేష్ తో ఎప్పటినుంచో సినిమా చేద్దాం అనుకున్నా, నా కల ఇంత గొప్ప సినిమాతో నెరవేరడం నా అదృష్టం. మా బ్యానర్ లో ఇంత గొప్ప సినిమా, గర్వ పడే సినిమా తీసినందుకు కొరటాల శివ గారికి, మహేష్ బాబు కి ఇద్దరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటా – నిర్మాత డి వి వి దానయ్య
మంచి సినిమా అంటే రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాదు మంచి సినిమాగా గుర్తుండిపోవడం, అదే భరత్ అనే నేను. కొరటాల శివగారు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లే కాకుండా అన్నీ గుర్తుపెట్టుకొనే గొప్ప సినిమాలు – దేవి శ్రీ ప్రసాద్
మంచి కథ రాస్కునప్పుడు.. మహేష్ బాబు లాంటి గొప్ప యాక్టర్ తోడైతే ధైర్యంగా ఉంటుంది. రాసుకున్న దానికంటే బాగా వస్తుంది. మహేష్ బాబు లాంటి యాక్టర్ కి యాక్షన్, కట్ చెప్పడం ఇట్స్ ఎ డ్రీం కం ట్రూ ఆల్వేస్. మా హ్యాట్ట్రిక్ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తుంటాను – దర్శుకుడు కొరటాల శివ
చాలా రోజులైపోయింది ఇలా షీల్డ్స్ ఇచ్చి, చాలా బాగా అనిపిస్తుంది. అమ్మగారి పుట్టిన రోజున సినిమా రిలీజ్ అయ్యింది.. నాన్నగారి పుట్టినరోజు మే 31 వరుకు షేర్స్ ఇలానే చెప్పుతుండాలి. నాన్నగారి అభిమానులు నా అభిమానులు నన్ను సూపర్ స్టార్ అంటుంటారు.. ఆ సూపర్ స్టార్ కి నాలుగేళ్లలో రెండు సార్లు లైఫ్ ఇచ్చాడు కొరటాల శివగారు. ఎప్పుడూ రుణపడి ఉంటాను సర్. ఇలాగె శ్రద్ధతో అంతః కరణ శుద్ధితో సినిమాలు చేస్తుంటాను – సూపర్ స్టార్ మహేష్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here