నారి నారి నడుమ అజ్ఞాత‌వాసి.. 

Sensational Pre-release Buzz on Agnyaathavaasi!
ఈ ఫోటో చూస్తుంటే ఇంత‌కంటే గొప్ప మాట మ‌రోటి గుర్తుకు రాదు. ఇప్ప‌టి వ‌ర‌కు అజ్ఞాత‌వాసిలోని అన్ని కోణాలు ప్రేక్ష‌కుల‌కు క‌నిపించాయి. ఇకిప్పుడు రొమాంటిక్ యాంగిల్ ను కూడా బ‌య‌టికి తీసుకొచ్చాడు త్రివిక్ర‌మ్. తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్స్ సినిమాపై ఎక్క‌డ‌లేని అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ పోస్ట‌ర్స్ చూసిన త‌ర్వాత సినిమాలో ఎంత రొమాన్స్ ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతుంది. అన్న‌ట్లు అజ్ఞాత‌వాసి ట్రైల‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాలేదు. దీనిపై కూడా క్లారిటీ వ‌చ్చింది. జ‌న‌వ‌రి 4 సాయంత్రం 6 గంట‌ల‌కు అజ్ఞాత‌వాసి ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. ఏ మాత్రం హ‌డావిడి లేకుండా సింపుల్ గా ఈ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జ‌న‌వ‌రి 10న సినిమా విడుద‌ల కానుంది. అప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్ తోనే ర‌చ్చ చేయ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తుంది. అజ్ఞాత‌వాసి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆకాశాన్ని తాకేస్తుంది. ఒక‌టి రెండు కాదు.. 111 కోట్ల థియెట్రిక‌ల్ బిజినెస్.. 44 కోట్లు శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. మొత్తానికి 155 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. బాహుబ‌లి కాకుండా మెర్స‌ల్, స్పైడ‌ర్ మాత్ర‌మే 150 కోట్ల మార్క్ బిజినెస్ అందుకున్నాయి. మ‌రిప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here