నా కోసం ద‌ర్శ‌కులు రావ‌ట్లేదంటున్న నాని..


అదేంటి.. ఇప్పుడు ఓకే అనాలే కానీ ద‌ర్శ‌కులంతా నాని కోసం క్యూ క‌డ‌తారు క‌దా..! అలాంటిది ఆయ‌నతో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌కులు లేక‌పోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి కాస్త చిత్రంగా అనిపించినా ఇదే నిజం. ఎందుకంటే ఇది స్వ‌యంగా నాని చెప్పిన మాటే. త‌న కోసం ద‌ర్శ‌కులు రావ‌ట్లేదంటూ..
వాళ్లంతా బిజీగా ఉన్నారంటూ చెప్పాడు న్యాచుర‌ల్ స్టార్. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ‌ ద‌ర్శ‌కులు రావ‌డం లేదు అనేది త‌న‌తో ఆల్రెడీ ప‌నిచేసిన వాళ్ల గురించే చెప్పాడు నాని. త‌న‌తో సినిమా చేసిన త‌ర్వాత వాళ్లు త‌న‌తోనే మ‌ళ్లీ ప‌ని చేయ‌లేనంత బిజీగా అవుతున్నార‌ని చెప్పాడు నాని. దాన్ని చూసి సంతోషించాలో..
త‌న‌తో మ‌రో సినిమా చేయ‌ట్లేద‌ని బాధ ప‌డాలో అర్థం కావ‌ట్లేదంటున్నాడు నాని. మారుతి.. శివ‌నిర్వాణ‌.. ఇలా ఎవ‌ర్ని తీసుకున్నా వ‌ర‌స సినిమాలు చేస్తున్నార‌ని.. దాంతో త‌న‌తోనే సినిమా చేయ‌లేక‌పోతున్నార‌ని చెప్పాడు నాని. త‌నే కావాల‌నుకుని వ‌చ్చిన‌పుడు క‌చ్చితంగా ప‌ని చేస్తాన‌ని చెప్పాడు నాని. మ‌రోవైపు త‌ను కూడా కొత్త స్క్రిప్టులు.. కొత్త ద‌ర్శ‌కుల రాక‌తో పాత వాళ్ల‌ను ప‌ట్టించుకునే స‌మ‌యం లేదంటున్నాడు నాని. మొత్తానికి అంతేలెండి.. ఒక్క హిట్ ఇచ్చిన త‌ర్వాత మ‌రో హిట్ కోసం చూడాలి కానీ హిట్టిచ్చిన ద‌ర్శ‌కుల కోసం కాదు..! అదే నాని పాల‌సి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here