నితిన్ పెద్ద‌పులిని బాగానే ఎక్కాడుగా..

తెలంగాణ నేప‌థ్యంలో ఉన్నోళ్ల‌కు పెద్ద‌పులి పాట గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇక్క‌డ ఏ జాత‌ర జ‌రిగినా.. అమ్మ‌వారి బోనాలు జ‌రిగినా ఈ పాట మాత్రం కామ‌న్. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట మాత్ర‌మే వినిపించిన ఈ పాట‌ను ఇప్పుడు సినిమాలోనూ వాడేసాడు నితిన్. పైగా ఈయ‌న కూడా తెలంగాణానే కావ‌డం విశేషం. సినిమా వాళ్ల‌కు ప్రాంతీయ విభేధాలు పెట్ట‌డం స‌రికాదు.. కానీ ఇక్క‌డ అలా స‌రిపోయిందంతే. ఎవర్నీ ఉద్దేశించింది మాత్రం కాదు. నితిన్ వాడుకున్నాడు కాబ‌ట్టి ఇక్క‌డి వాళ్ల‌కు ఇంకా ఈజీగా క‌నెక్ట్ అవుతుంది ఈ పాట‌. ఛ‌ల్ మోహ‌న్ రంగా కోసం ఈ పాట‌ను రీమిక్స్ చేసాడు థ‌మ‌న్. పెద్ద‌పులి అనే లైన్స్ మాత్ర‌మే వాడుకుంటూ.. మిగిలిన పాట‌ను క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా తిరిగి రాయించుకున్నాడు ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య‌. సాహితి ఈ పాట‌ను రాసాడు.
ఇక ఈ పాట‌లో నితిన్ ఎన‌ర్జీ చూసి క‌ళ్లు బైర్లు గ‌మ్మాల్సిందే. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువగా ఫోక్ సాంగ్స్ పాడుతూ అల‌రిస్తున్న రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట త‌న‌దైన శైలిలో దుమ్ములేపాడు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో బోనాల ముందు ర‌చ్చ ర‌చ్చ చేసారంతే. లిరిక‌ల్ సాంగ్ లోనే కొన్ని మూవెంట్స్ చూపించాడు ద‌ర్శ‌కుడు. ఇక రేపు థియేట‌ర్స్ లో ఈ పాట చూస్తుంటే ప్రేక్ష‌కుల‌కు పూన‌కాలు రావ‌డం ఖాయం. ఎప్రిల్ 5న ఛ‌ల్ మోహ‌న్ రంగా విడుద‌ల కానుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి త్రివిక్ర‌మ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి కూడా ఈ చిత్రంలో భాగ‌మే. జై చిరంజీవ త‌ర్వాత త‌న ద‌ర్శ‌క‌త్వంలో కాకుండా మ‌రో ద‌ర్శ‌కుడికి క‌థ అందించాడు త్రివిక్ర‌మ్. ఈ చిత్ర క‌థ రాసింది మాట‌ల మాంత్రికుడే. మేఘాఆకాశ్ ఇందులో నితిన్ తో జోడీక‌ట్టింది. మొత్తానికి చూడాలిక‌.. నితిన్ కెరీర్ కు ఛ‌ల్ మోహ‌న్ రంగా ఎంత‌వ‌ర‌కు హెల్ప్ కానుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here