నితిన్ హ్యాపీయే అంటారా..? 

ఛ‌ల్ మోహ‌న్ రంగా విడుద‌లైంది. ప‌ర్లేదు.. బాగుంది.. జ‌స్ట్ ఓకే.. కామెడీతో నెట్టుకురావ‌చ్చు.. ఇలాంటి క‌మెంట్స్ ఎక్కువ‌గా ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్నాయి. వీటిని చూసి ఇప్పుడు నితిన్ హ్యాపీగా ఫీల్ అవ్వాలా.. లేదంటే మ‌రోసారి పాజిటివ్ టాక్ రాలేద‌ని బాధ ప‌డాలో అర్థం కావ‌డం లేదు ఈ కుర్ర హీరోకు. ఇదే సినిమా ఏ టైమ్ లో విడుద‌లైనా కూడా నితిన్ నిశ్చింత‌గా ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎదురుగా రంగ‌స్థ‌లం అనే కొండ ఒక‌టి ఉంది. దాన్ని ఢీ కొట్టాలంటే అద్భుతం చేయాలి. ఇప్ప‌టికీ హౌజ్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో రంగ‌స్థ‌లం ర‌చ్చ చేస్తుంది. ఈ చిత్రానికి ధీటుగా నిల‌బ‌డాలంటే త‌న సినిమా కూడా అంత బాగోలేక‌పోయినా క‌నీసం అందులో ముప్పావు వంతు ఉండాలి. ఇప్పుడు విడుద‌లైన ఛ‌ల్ మోహ‌న్ రంగా కామెడీతో గ‌ట్టెక్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కానీ అది కూడా కేవ‌లం మూడు రోజుల వ‌ర‌కే. వీక్ డేస్ లో సినిమా వీక్ అవ్వడం ఖాయంగా క‌నిపి స్తుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్ ట్రీట్ మెంట్ తో సినిమాలో కామెడీ బాగానే వ‌ర్క‌వుట్ అయింది కానీ క‌థ విష‌యంలోనే కంగారు ఉంది. పాత క‌థ‌ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ తిప్పి తిప్పి తీసాడు కృష్ణ‌చైత‌న్య‌. దానికి త్రివిక్ర‌మ్ కూడా త‌న వంతు సాయం చేసాడు. అయితే ఓవ‌ర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి మంచి టాక్ వ‌చ్చింది.. అక్క‌డ ఓపెనింగ్స్ కూడా బ్ర‌హ్మాండంగా వ‌స్తున్నాయి. మొత్తానికి చూడాలిక‌.. లై డిజాస్ట‌ర్ నుంచి ఛ‌ల్ మోహ‌న్ రంగా నితిన్ ని బ‌య‌ట‌ప‌డేస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here