నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన "పరిచయం" టీజర్

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై హైద్రాబాద్ నవాబ్స్ మూవీ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం  “పరిచయం”.. ఈ చిత్రం టీజర్ & ఫస్ట్ లుక్ ని న్యాచురల్ స్టార్ నాని విడుదల చేసారు..విరాట్ కొండూరు హీరో గా పరిచయం అవుతున్న ఈ మూవీ లో సిమ్రత్ కౌర్ హీరోయిన్…
టీజర్ విడుదల సందర్భంగా నాని మాట్లాడుతూ.. “ఈ చిత్రం టీజర్ చాలా ఫ్రెష్ గా ఉందని చూస్తుంటే మణిరత్నంగారి “గీతాంజలి” మూవీ గుర్తుకు వస్తుందని మళ్ళీ మళ్ళీ చూడాలని పించేలా ఉందని  చిత్రంలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ కథకి బాగా స్యూట్ అయ్యారు, ఈ చిత్రం ద్వారా నా మిత్రుడు దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నకి, చిత్ర నిర్మాత రియాజ్ గారికి మంచి సక్సస్ వచ్చి ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు ఈ పరిచయం ద్వారా అందరికి పరిచయం అవ్వాలి” అన్నారు.
చిత్ర నిర్మాత రియాజ్ మాట్లాడుతూ.. “నాని గారు టీజర్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు థాంక్స్ చెప్తూ, షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉందని, ఏప్రిల్ మొదటి వారంలో  రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న మాట్లాడుతూ.. “నాని గారు మా టీజర్ ని గీతాంజలి లాంటి మంచి మూవీతో పోల్చటం ఆనందం గా ఉంది, అలాగే మా మూవీ కి సపోర్ట్ చేసినందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన నాని గారికి రుణపడి ఉంటాం. ఈ చిత్రం లవ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి స్ట్రాంగ్ ఎమోషన్ గా ఉంటుంది” అన్నారు.
చిత్ర సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, హీరో విరాట్ కొండూరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాంకేతిక నిపుణులు
లిరిక్స్ – భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ
డైలాగ్స్ సాగర్
కోరియోగ్రఫీ – విజయ్ ప్రకాష్, హరికిరణ్
ఫైట్స్ – రామకృష్ణ
PRO – వంశీ శేఖర్
చీఫ్ కో డైరెక్టర్- సత్యం కల్వకోలు
ఆర్ట్ – రాజకుమార్ గిబ్సన్
ఎడిటర్ –  ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ – నరేష్ రానా
మ్యూజిక్ – శేఖర్ చంద్ర
నిర్మాత – రియాజ్
రచన దర్సకత్వం – లక్ష్మీకాంత్ చెన్నా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here