నేను ఇంట‌లిజెంట్ అంటున్న సాయిధ‌రంతేజ్..

sai dharam tej, vv vinayak, c kalyan in maskat for film shooting
అదేంటి.. ఆయ‌న‌కు ఆయ‌నే ఇది డిసైడ్ చేసుకున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? అయినా ఇప్పుడు అంత‌గా ఇంట‌లిజెంట్ అనిపించుకునేంత ప‌ని ఏం చేసాడు సాయిధ‌రంతేజ్ అనుకుంటున్నారా..? ఏం చేసినా.. చేయ‌క‌పోయినా ఇప్పుడు సాయి ఇంట‌లిజెంటే..! అదెలా అంటారా.. మొన్న సినిమా ప్లాపైనా కూడా విన్న‌ర్ అవ్వ‌లే.. జ‌వాన్ ఫ్లాప్ అయినా వ‌ర‌స అవ‌కాశాలు అందుకోవ‌ట్లా..? అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇంట‌లిజెంట్ అవుతున్నాడు. అదేనండీ ఇప్పుడు సాయిధ‌రంతేజ్-వినాయ‌క్ కాంబినేష‌న్ లో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే క‌దా..! ఖైదీలో చిరంజీవి స్టైల్ కు త‌గ్గ‌ట్లు క‌త్తిని మార్చాడు వినాయ‌క్. ఇక ఇప్పుడు మ‌రోసారి ప‌క్కా మాస్ క‌థ‌తోనే రానున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఆకుల శివ రాసిన క‌థ‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్.. స‌త్యానంద్ త‌మ‌దైన శైలిలో మాట‌లు కూడా రాసారు.
ఇక ఇప్పుడు అంద‌ర్లోనూ ఒక‌టే అనుమానం.. ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందా అని..? దీనికి ఓ స‌మాధానం కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో మాట‌ల‌తో ప‌డేసే పాత్ర‌లో న‌టిస్తున్నాడు సాయిధ‌రంతేజ్. దీనికి మొద‌ట్లో దుర్గ అనే టైటిల్ ప్రచారంలోకి వ‌చ్చినా.. ఆ త‌ర్వాత ధ‌ర్మాభాయ్ అన్నారు. అయితే ఇప్పుడు అది కాదు ఇంట‌లిజెంట్ అంటున్నారు. క‌థ‌కు ఇంట‌లిజెంట్ అనే టైటిల్ ప‌క్కాగా స‌రిపోతుంద‌ని భావిస్తున్నాడు వినాయ‌క్. ఫిబ్ర‌వ‌రీ నాటికి సినిమా పూర్తి కానుంది. స‌మ్మ‌ర్లో విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది. లావ‌ణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. అస‌లే వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న లావ‌ణ్య‌.. సాయిధ‌రంతేజ్ కు వినాయ‌క్ సినిమా వ‌రంగా మారింది. చూడాలిక‌.. ఈ సినిమాతో వాళ్ల కెరీర్ గాడిన ప‌డుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here