నేహాశెట్టి.. అందాల‌న్నీ ఎక్కుపెట్టి..!


నేహాశెట్టి.. ఈ పేరు ఇప్పుడు చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. కానీ నెల రోజుల త‌ర్వాత క‌చ్చితంగా ఈ భామ పేరు తెలుగు ఇండ‌స్ట్రీలో మార్మోగిపోవ‌డం ఖాయం. ఎందుకంటే ఈ అందాన్ని తీసుకొస్తుంది పూరీ జ‌గ‌న్నాథ్. కొడుకు మెహ‌బూబా సినిమా కోసం నేహాశెట్టిని టాలీవుడ్ కు దిగుమ‌తి చేస్తున్నాడు పూరీ.
ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న ప‌రిచ‌యం చేసిన హీరోయిన్లు అంతా మంచి స్టేజ్ లోనే ఉన్నారు. ఎవ‌రో నేహాశ‌ర్మ లాంటి ఒక‌రి ద్ద‌రు మిన‌హాయిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు పూరీ హీరోయిన్ల‌లో సక్సెస్ అయిన వాళ్లే ఎక్కువ‌. ఇప్పుడు నేహాశెట్టి కూడా స్టార్ అవుతుందేమో అనే ఆస‌క్తి అందర్లోనూ క‌నిపిస్తుంది.
దానికి త‌గ్గ‌ట్లే మెహ‌బూబా ట్రైల‌ర్ లో క‌నిపించిన రెండుమూడు షాట్ల‌లోనే అద్భుతంగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. క‌చ్చితంగా ఈ సినిమా త‌ర్వాత నేహా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మార‌డం ఖాయం. మే 11న మెహ‌బూబా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here