న‌టీనటులెవ‌రైనా ఈ హెల్త్ క్యాంప్‌లో టెస్ట్‌లు చేయించుకోవచ్చు – శివాజీరాజా, న‌రేష్‌

ప్ర‌తినెల రెండో ఆదివారం రోజు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈనెల 11వ తేదీ ఆదివారం రోజు ఉద‌యం కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో హెల్త్ క్యాంప్‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది.
ఇన్‌సైట్స్ డ‌యాగ్నోస్టిక్స్‌కు సంబంధించిన డా.శ్రీకాంత్ అప్ప‌సాని, డా.శ్రీనివాస‌రాజు క‌లిదిండి స‌మ‌క్షంలో ఈ హెల్త్ క్యాంప్‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది. లివ‌ర్ మ‌రియు కొలెస్ట్రాల్ ఇన్‌స్పెక్ష‌న్‌కు సంబంధించిన వ్యాధుల నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌బ‌డిన‌వి. ఈ హెల్త్ క్యాంప్‌కు హాజ‌రు కానివారు నేరుగా త‌మ హాస్పిట‌ల్‌కు వెళ్తే 25శాతం డిస్కౌంట్ ఇవ్వడం జ‌రుగుతుంద‌ని డా.శ్రీకాంత్ అప్ప‌సాని తెలియ‌జేశారు.
        ఈ సంద‌ర్భంగా ‘మా’ అధ్య‌క్షులు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ న‌రేష్‌ మాట్లాడుతూ.. “ఈ క‌మిటీ వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నాం. అయితే న‌టీన‌టుల‌కు ముఖ్య‌మైన‌ది ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌టం. అందుచేత ప్ర‌తీ నెల రెండో ఆదివారం రోజు ఈ హెల్త్ క్యాంప్‌ను నిర్వ‌హిస్తున్నాం. కేవ‌లం మా అసోసియేష‌న్‌లో మెంబ‌ర్స్ మాత్ర‌మే కాకుండా ఇత‌ర న‌టీన‌టులెవ‌రైనా ఈ హెల్త్ క్యాంప్‌లో టెస్ట్ చేయించుకోవ‌చ్చు” అన్నారు.
    ఈ కార్యక్ర‌మంలో హెల్త్ క‌మిటీ చైర్మ‌న్ నాగినీడు, బెన‌ర్జీ, ట్రెజ‌ర‌ర్ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఇసి మెంబ‌ర్స్‌, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, ఇసి మెంబ‌ర్ ల‌క్ష్మీకాంత‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here