పరిటాల రవి పరిటాల శ్రీరామ్ దంపతులను ఆశీర్వదించిన వేళ!

ఇటీవలే పరిటాల శ్రీరామ్ వివాహం అల్లం జ్ఞాన తో అక్టోబర్ 1 న అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా హాజరు కావడం విశేషం. వివేక్ ఒబెరాయ్ రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర చిత్రంలో దివంగత నేత పరిటాల రవి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వివేక్ వధూవరుల తో ముచ్చటించి, టీడీపీ ఏం.ఎల్.ఏ అయిన పరిటాల సునీత ను పలకిరించి వెళ్లారు. అయన రాక పరిటాల కుటుంబ ఫ్యాన్స్ ను, అనుచరులను ఉత్తేజ పరిచింది.