బుధవారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అప్పట్లో నేను మోదీని కలిసినప్పుడు ‘పవన్ కల్యాణ్ ఎవడు’ అని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. నరేంద్ర మోదీని కలిస్తే ద్రోహం చేసినట్లు మాట్లాడారు. దర్శకుడు శేఖర్ కమ్ముల వంటి వారు కూడా దీనిపై స్పందించి ట్వీట్ చేశారు. ఏదీ మరిచిపోలేదు. సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాను. ఈ రోజు నేను మోదీని గట్టిగా నిలదీస్తున్నాను. మరి ఇప్పుడేమంటారు?, అని ప్రశ్నించారు పవన్.