పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ మల్టీస్టార్రర్ వస్తుందా?

త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముహూర్తం షాటుకు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు.

ఇద్దరు తరాల ఫ్యాన్స్ కు ఇది పండగను తెచ్చింది. హీరోల పేరులు చెప్పి గొడవలు పడే మూర్ఖపు ఫ్యాన్స్ కి ఇది చంప దెబ్బ కొట్టినట్లయిందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.

 

IS It ? pawan and ntr do a multi starrer

 

పవర్ స్టార్, యంగ్ టైగర్ కలిసి ఫోటోలకు పోజులిస్తేనే ఉబ్బితబ్బిబు అవుతున్న ఫ్యాన్స్ ఇక వారిద్దరూ ఓ చిత్రంలో కలిసి నటిస్తే వారి అందానికి అవధులే ఉండవు. ఫ్యాన్స్ కోరికను తీర్చ కలిగే సత్తా ఉన్న డైరెక్టర్ త్రివిక్రమే అంటున్నారు.

ఆ మధ్య వెంకటేష్ తో ఓ మల్టీస్టార్రర్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్, అది పట్టాలెక్కక పోవడంతో ఆ కథని అటకమీద పెట్టేసాడు. ఇప్పుడు ఆ కథతో పవన్ – ఎన్టీఆర్ తో మల్టీస్టార్రర్ ప్లాన్ చేస్తే బాగుండు అని ఫ్యాన్స్ బలం గా కోరుకుంటున్నారట!