పవన్ కళ్యాణ్ గుండు వెనక కథ ఇదే…

 

పవన్ కళ్యాణ్ కి నిజంగా పరిటాల రవి గుండు కోటించారు అని  కొంతమంది సందేహం పడితే మరి కొందరు  అది నిజం అని నమ్మారు . కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ విశాఖపట్నం లో పర్యటిస్తుండగా తన గుండు వెనక దాగి ఉన్న నిజం చెప్పారు. తానె  గుండు కోటిచుకున్నారు అని అప్పట్లో పరిటాల రవి ఎవరో కూడా తెలీదు అని అన్నారు, అయితే ఇది  నిజం అంటూ రచయత దివాకర్ బాబు మాడభూషి  తన మనుసులో మాటను తన సోషల్ మీడియా ద్వారా చెప్పారు

“ఒక జ్ఞాపకం అనంతపురం… హైదరాబాద్. శ్రీ పరిటాల రవి… శ్రీ పవన్ కళ్యాణ్…పరిటాల రవి గారు ఒక పాయింట్ చెప్పి కథ చేయమన్నారు. అదేమిటంటే

శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణుడు ప్రస్తుత కాలం లోకి వస్తే జరిగే పరిణామాలు ఎలా వుంటాయి? డైరెక్టర్ మరియు ప్రముఖ కో డైరెక్టర్ శ్రీ కుర్రా రంగారావు గారిని, నన్నూ ఫిల్మ్ నగర్ హైదరాబాద్ లో పరిటాల రవి గారు వారి ఇంటికి పిలిచి పైన చెప్పిన పాయింట్ మీద వర్క్చేయమని చెప్పారు. అప్పుడు మా ఇల్లు వారింటికి రెండు వీధుల పక్కనే. సరే కథ అల్లాను. మమ్మల్ని అనంతపురం రమ్మన్నారు. వెళ్ళాము

అప్పుడు రవి గారి ఇల్లు రెన్నొవేషన్ జరుగుతోంది. మమ్మల్ని ఒక గెస్ట్ హవుస్ కి తీసుకువెళ్లారు. కథ విన్నాక తను అనుకున్న విధంగా రాలేదని మళ్ళీ వర్క్ చేయమని చెప్పారు పరిటాల రవి గారు. అదలా వుంచితే అప్పట్లో పరిటాల రవి గారు పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించారన్న పుకారు విపరీతంగా షికారు చేస్తోంది. ఆ విషయం నాకు అనవసరమైనా ఒక కళాకారుడ్ని గురించి జనం అలా చెప్పుకోవడం అవమానంగా , బాధ గా అనిపించేది. ఆ విషయమై పరిటాల రవి గారిని అడగచ్చో లేదో.. అడిగితే ఎలా రియాక్టవుతారో.. ఓ పక్కన భయంగా వున్నా అడిగేశాను. పరిటాల రవి గారు ‘అలాంటిదేమీ లేదండీ.. ఈ పుకారు ఎలాపుట్టిందో, ఎవరు పుట్టించారో కూడా అర్ధం కావడం లేదు.’అన్నారు.అంటే ఆ పుకారు నిజంగా ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించిన కట్టు కథ. నిన్ననో, మొన్ననో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో గుండుప్రస్థావన తెచ్చినప్పుడు ఈ సంఘటన జ్ఞాపకానికి వచ్చింది.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here