పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వై.ఎస్.ఆర్.సి.పి మహిళా నేత

వై.ఎస్.ఆర్.సి.పి  పార్టీ కార్యకర్త సామాన్య కిరణ్ పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. చే గువేరా స్ఫూర్తి అని చెప్పుకొనే పవన్ కళ్యాణ్ ముగ్గురు ని పెళ్లి చేసుకోవడమేమిటి, ఇద్దరు పిల్లలతో రేణు దేశాయ్ ను వదిలేసినా ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అని ప్రశ్నిచారు సామాన్య.
YSRCP leader Samanya Kiran criticizes Pawan Kalyan
ఇటీవల రేణు దేశాయ్ పునః వివాహం పై తన ఆలోచనలు తెలుపగా పవన్ అభిమానులు ఆమె ను దూషించడం విచారకరమన్నారు ఆమె. పవన్ ఏ విధంగా గొప్పవాడో అభిమానులు చెప్పాలన్నారు.
ఆయన ఆడవాళ్లకు ఏమి న్యాయం చేయగలడు అని ప్రశ్నించారు. కాటంరాయుడు చిత్రం లో మందేసి చిందేయ్యరో అని పాటకు డ్యాన్స్ చేసిన పవన్ యువతకు ఏమి మెసేజ్ ఇస్తాడు అని సామాన్య విమర్శించారు.
జగన్ ఉన్నత భావాలున్న వ్యక్తి అని అందుకే ఆయన అభిమానిని అయ్యానని చెప్పారు ఆమె. సామాన్య కిరణ్ అనేక రచనలు చేసారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.