పవన్ ను అన్నందుకే జబర్దస్త్ లో నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు – కత్తి మహేష్

గత వరం వచ్చిన జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది చేసిన స్కిట్ లో తనపై వేసిన సెటైర్ లపై స్పందించారు కత్తి మహేష్. “పెళ్లి అనేది సినిమా తీసినంత కష్టం, కానీ ప్రేమ ముందు పొట్టేసుకొని వెనుక బట్టేసుకొని రివ్యూ రాసినంత ఈజీ,”  అని  హైపర్ ఆది వేసిన పంచ్ కు హర్ట్ అయ్యారట కత్తి మహేష్. తాజాగా అయన షేర్ చేసిన వీడియో లో హైపర్ ఆది పై విరుచుకుపడ్డారు కత్తి మహేష్. వ్యక్తుల అప్పీరెన్స్ పై  జోకులు వేయడం కరెక్ట్ కాదని. తనకు పొట్ట బట్ట ఉందని ఫీల్ అవట్లేదని. అటువంటి హాస్యం అపహాస్యం అవుతుందని. ఆది వేసి కుళ్ళు జోకులకు నాగ బాబు పడి పడి ఎందుకు నవ్వుతాడో తనకు అర్ధం కాదని, బహుశా అయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద నేను కామెంట్స్ చేసినందుకు కక్షసాధింపు గా ఆది చేత నా మీద పంచులు వేయించి ఉంటారని భావించారు కత్తి మహేష్.