పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ టీజర్

ఛల్ మోహన్ రంగ

నితిన్, మేఘా ఆకాష్జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం.

కథానాయకుడు  నితిన్ కు 25 చిత్రం.

మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ చిత్రానికి కథను అందిస్తున్నారు.

చిత్రం టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ @pkcreativeworks ఖాతా ద్వారా  రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు.’ఛల్ మోహన్ రంగటీజర్ కు లభిస్తున్న స్పందన ఎంతో సంతోషంగా ఉందని హీరో నితిన్ తన స్పందనను సోషల్ మీడియా వేదికగా కృతఙ్ఞతలు తెలుపుతున్నారు

శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు.హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ చిత్రం.

ఛల్ మోహన్ రంగచిత్రానికి సంబంధించి ఆఖరి పాట చిత్రీకరణ రోజు హైదరాబాద్ లో ప్రారంభమయింది.    సందర్భంగా చిత్ర నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.. హీరో నితిన్ పై పాట చిత్రీకరణ జరుగుతోంది.శేఖర్ పాటకు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు  చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 5 చిత్రం విడుదల కానుందని తెలిపారు

చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..’ ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు

 చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

సంగీతం: థమన్.ఎస్.ఎస్.,కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, , కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ

సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి

నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి

స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here