పాపం.. నానికి బాగా గ‌ట్టిగా త‌గిలిందిగా..!

 
Nani accident
చాలా ఏళ్లైంది క‌దా ఫ్లాప్ అనే మాట విని.. అందుకే ఇప్ప‌టికీ నాని దాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాడు. ఒక‌టా రెండా వ‌ర‌స‌గా ఎనిమిది విజ‌యాల‌తో దూకుడు మీదున్న నానికి కృష్ణార్జున యుద్ధం కోలుకోలేని దెబ్బ కొట్టేసింది. ఈ చిత్రం స‌గానికి స‌గం బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచేసింది.
నాని ఉన్నాడు క‌దా అనే ధైర్యంతో 30 కోట్ల‌కు సినిమాను కొంటే జ‌ర్నీ మాత్రం 15 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఇంటా బ‌య‌టా అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఈ కృష్ణా ర్జునులు క‌లిసి ముంచేసారు. పైగా ఐదు మిలియ‌న్ సినిమాలున్న హీరోగా రికార్డ్ సృష్టించిన ఓవ‌ర్సీస్ లో కూడా రెండో రోజే కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అని తేల్చేసారు ప్రేక్ష‌కులు. రొటీన్ స్టోరీలు ఒక్క‌సారి చూస్తాం కానీ ప్ర‌తీసారి అంటే కాస్త క‌ష్ట‌మే అంటున్నారు ప్రేక్ష‌కులు.
దాంతో ఇప్పుడు నానికి కూడా క‌ళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడు కానీ రూట్ మార్చి కొత్త‌గా ట్రై చేయ‌క‌పోతే నానికి మ‌రిన్ని షాకులు త‌గ‌ల‌డం ఖాయం. మ‌రి ఈ ఫ్లాప్ ను మ‌రిచిపోయి.. మ‌ళ్లీ శ్రీ‌రామ్ ఆదిత్య సినిమాతో ఫామ్ లోకి వ‌స్తాడో లేదో..? ఈ చిత్రంతో పాటే విక్ర‌మ్ కే కుమార్, హ‌నురాఘ‌వ‌పూడి, కిషోర్ తిరుమ‌ల
లాంటి ద‌ర్శ‌కుల‌కు కూడా ఓకే చెప్పాడు న్యాచుర‌ల్ స్టార్. మ‌రి చూడాలిక‌.. నాని కెరీర్ ఎటు నుంచి ఎటు వెళ్ళ‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here