పాపం.. నాని బాగా ఫీలైన‌ట్లున్నాడే..!

MCA Nani Interview Photos
ఎంత హీరో అయినా.. ఎంత సెలెబ్రెటీ అయినా కూడా వాళ్ల‌కూ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఉంటుంది. ప‌ర్స‌న‌ల్ ఎవ‌రికైనా ప‌ర్స‌న‌లే. నాలుగు గోడ‌ల మధ్య జ‌రిగే ఇష్యూని ప‌దిమందికి చెప్తామంటే ఎవ‌రికైనా చిరాకు వ‌స్తుంది. ఇప్పుడు నాని విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. తెలుగు ఇండ‌స్ట్రీలో కాంట్ర‌వ‌ర్సీల‌కు వీలైనంత దూరంగా ఉండే హీరోల్లో నాని ఒక‌రు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఏ వివాదంలోనూ ఇరుక్కోలేదు. సింపుల్ గా త‌న ప‌నేదో తాను చూసుకుని పోయే టైప్. ఇలాంటి హీరోపై ఓ వెబ్ సైట్ నీచ‌మైన వార్త‌లు రాసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నానినే చెప్పాడు. త‌న‌కు గాసిప్స్ ప‌ట్టించుకునే అలవాటే లేద‌ని.. అది మీ వృత్తి.. కాబ‌ట్టి మిమ్మ‌ల్ని నేనేం అనలేనన్నాడు నాని. కానీ అది కూడా కొంత‌వ‌ర‌కే.. ప‌క్కోడి ప‌ర్స‌నల్ లైఫ్ లోకి వ‌చ్చి తొంగిచూడ‌టం మాత్రం క‌రెక్ట్ కాద‌న్నాడు నాని. త‌న‌కు కూడా ఓ భార్య ఉంద‌ని.. పిల్లాడు ఉన్నాడ‌ని.. పెళ్లైన హీరో గురించి ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాస్తే ఏమనుకోవాల‌ని ప్ర‌శ్నించాడు నాని. త‌న‌కు ఓ హీరోయిన్ కు ఎఫైర్ ఉంద‌ని ఆ వెబ్ పోర్ట‌ల్ రాసింద‌ని చెప్పాడు నాని. కావాలంటే తాను వాళ్ల పేరు చెప్పొచ్చు కానీ అలా చేసి వాళ్ల ఇమేజ్ తీయ‌డం త‌న ఉద్దేశ్యం కాద‌న్నాడు నాని. మొత్తానికి ఎప్పుడూ కూల్ గా క‌నిపించే నాని కూడా ఇప్పుడు ఫైర్ అయ్యాడు. మ‌రి ఇప్ప‌టికైనా ఆ రాత‌లు మార‌తాయా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here