పూజా.. ఏంట‌మ్మా నీ అదృష్టం..? 

Pooja Hegde Mahesh25
ఇప్పుడు క‌చ్చితంగా మిగిలిన హీరోయిన్లు పూజాహెగ్డేను చూసి క‌ళ్లుకుంటుంటారు. అలా లేదంటే మాత్రం వాళ్లు అబ‌ద్ధం చెబుతున్న‌ట్లే. కెరీర్ లో ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా లేకుండానే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయ్యేలా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఏం మాయ చేస్తుందో తెలియ‌దు కానీ వ‌ర‌స‌గా స్టార్ హీరోలు వ‌చ్చి ఈ భామ ముందు వాలిపోతున్నారు. ముందు అల్లుఅర్జున్.. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్.. వెంట‌నే మ‌హేశ్.. ఇలా ఒక్కొక్క‌రుగా వ‌చ్చి పూజా జ‌పం చేస్తున్నారు. స‌మంత‌, కాజ‌ల్, త‌మ‌న్నా లాంటి హీరోయిన్లు అంతా ఓల్డ్ అయిపోవ‌డంతో కొత్త‌వాళ్ళ‌తో జోడీ క‌ట్ట‌డానికి మ‌న హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇదే పూజాకు ఇప్పుడు అవ‌కాశాలు తీసుకొచ్చి పెడుతుంది. గ‌తేడాది వ‌చ్చిన డిజే జ‌స్ట్ ఓకే అనిపించినా కూడా అందులో పూజాహెగ్డే అందాలు మాత్రం అదిరిపోయాయి.
దాంతో ఇప్పుడు ఆ అందానికే అభిషేకం చేస్తున్నారు మ‌న ద‌ర్శక నిర్మాత‌లు. ఈ సినిమా త‌ర్వాత పూజా జాత‌క‌మే మారిపోయింది. రంగ‌స్థ‌లంలో ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఐటం సాంగ్ లో చిందేసింది పూజాహెగ్డే. దానికితోడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ సాక్ష్యంలో ఈ భామే హీరోయిన్ ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు మ‌హేశ్ -వంశీ పైడిప‌ల్లి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో పూజాకి ఇందులో అవ‌కాశం ద‌క్కింది. హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డంలో రాజుగారు దిట్ట‌. ఎప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విష‌యంపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమాలోనూ పూజాహెగ్డేనే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక హాసిని ట్విట్ట‌ర్ లో అఫీషియ‌ల్ గా పూజాహెగ్డేను తీసుకుంటున్న‌ట్లు అనౌన్స్ చేసారు.
ఇక ఇవ‌న్నీ ఉండ‌గానే ఇప్పుడు మ‌రో భారీ సినిమాలో ఆఫ‌ర్ అందుకుంది పూజాహెగ్డే. ప్ర‌భాస్-రాధాకృష్ణ సినిమాలోనూ పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో సంచ‌ల‌నం. సాహో సినిమా సెట్స్ పై ఉండ‌గానే ఈ సినిమాను కూడా మొద‌లు పెట్ట‌నున్నాడు ప్ర‌భాస్. జూన్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. మొత్తానికి పూజా దూకుడు చూసి అంతా షాక్ అవుతున్నారు. మ‌రోవైపు బాలీవుడ్ లోనూ స‌ల్మాన్ ఖాన్ ఈ భామ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. మొత్తానికి ఇటు తెలుగు.. అటు హిందీల్లో ఒకేసారి పూజా జాత‌కం మారిపోయేలా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here