పూజా కార్యక్రమంతో మొదలైన నరేష్ 55వ చిత్రం

కామెడీ కింగ్ అల్లరి నరేష్, టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్ లో వచ్చిన “ఆహా నా పెళ్లంట, యాక్షన్ 3డి, జేమ్స్ బాండ్” చిత్రాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హ్యాట్రిక్ హిట్ అనంతరం అల్లరి నరేష్-అనిల్ సుంకరల కాంబినేషన్ లో నాలుగో చిత్రం రానుంది. ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో “నందిని నర్సింగ్ హోమ్” చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని ఘనంగా చాటుకొన్న పి.వి.గిరి  దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు హైద్రాబాద్ లో నిర్వహించబడ్డాయి. అల్లరి నరేష్ నటించే 55వ సినిమా కాగా.. నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న 15వ చిత్రమిది.
ఈ చిత్రానికి కెమెరా: నగేష్, కళ: గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సమర్పణ: ఎ టీవి, నిర్మాణం: ఎకె ఎంటర్ టైన్మెంట్స్, దర్శకత్వం: పి.వి.గిరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here