పూరీకి మెహ‌బూబా సెట్ చేసిన ర‌కుల్..


కొత్త హీరోయిన్ల‌ను ప‌ట్టుకురావ‌డంలో పూరీ జ‌గ‌న్నాథ్ ను అందె వేసిన చెయ్యి. ఈయ‌న తీసుకొచ్చిన అసిన్.. స్టార్ ను చేసిన ఇలియానా లాంటి వాళ్లు ఏకంగా కొన్నేళ్ల పాటు ఇండ‌స్ట్రీని ఏలారు. ఇంత మంది హీరోయిన్లు ఉన్నా కూడా ఇప్ప‌టికీ సినిమాకు ఓ కొత్త భామ‌ను ప‌ట్టుకొస్తుంటాడు పూరీ. ఇప్పుడు కూడా ఇదే చేసాడు.
ఈయ‌న త‌న‌యుడి సినిమా మెహ‌బూబా కోసం నేహాశెట్టి అనే అమ్మాయిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఈ అమ్మాయి లుక్స్ ఇప్ప‌టికే కుర్రాళ్ల‌ను బాగా డిస్ట‌ర్బ్ చేస్తున్నాయి. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ లో కూడా నేహా లుక్స్ అదిరిపోయాయి. అస‌లు పూరీకి ఇలాంటి అంద‌మైన అమ్మాయిలు ఎక్క‌డ దొరుకుతార‌బ్బా అని మిగిలిన ద‌ర్శ‌కులు జుట్టు పీక్కుంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం పూరీ సినిమాలో నేహా రావ‌డానికి కార‌ణం ర‌కుల్ అని తెలుస్తుంది. మెహ‌బూబా ఇండియ‌న్ అబ్బాయి.. పాకిస్థాన్ అమ్మాయి మ‌ధ్య ప్రేమ‌క‌థ. దీని కోసం పాకిస్థానీలా క‌నిపించే అమ్మాయి కావాలి. అది నేహాలో చూసాడు పూరీ.
నేహా శెట్టి మెహబూబా ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్ట‌డం వెన‌క మాత్రం ఓ క‌థ ఉంది. ఇక్క‌డే ర‌కుల్ త‌న తెలివితేట‌లు వాడింది. పూరీ హీరోయిన్ నేహా శెట్టి.. ర‌కుల్ త‌మ్ముడు అమ‌న్ కు గాళ్ ఫ్రెండ్. నేహా, అమన్ చాలా క్లోజ్ గా ఉంటారు. అందుకే పూరీ ని రికమెండ్ చెయ్యమని అమన్ నుంచి ర‌కుల్ ను నేహ కోరడం.. వెంటనే రకుల్ ఆమెని ఆడిషన్ కి రమ్మని అడగడం.. అక్క చెవిలో అమన్ ఓ మాట వేయడం.. ఆ త‌ర్వాత పూరీ సీన్ లోకి రావ‌డం..
అన్నీ చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. పైగా ఈ భామ కూడా చూడ్డానికి బాగుంటుంది. దాంతో ఆకాశ్ కు అమ‌న్ గాళ్ ఫ్రెండ్ ను అలా సెట్ చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. మొత్తానికి త‌మ్ముడి కోసం పెద్ద ప‌నే చేసింది ర‌కుల్. ఇప్పుడు కానీ నేహా కెరీర్ స‌క్సెస్ అయితే జీవితాంతం ర‌కుల్ కు రుణ ప‌డిపోయి ఉంటుందేమో ఈ ముద్దుగుమ్మ‌..? ఈ చిత్రం మే 11న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here