పూరీ క‌నెక్ట్స్ కాదు.. ఛార్మి క‌నెక్ట్స్.. 

నేనొక్క‌సారి క‌మిటైతే నా మాట నేనే విన‌నంటూ డైలాగ్ రాసాడు పూరీ. కానీ ఈ డైలాగ్ త‌న‌కే కాస్త మార్చి రాసుకోవాల్సింది. నేనొక్క‌సారి క‌నెక్ట్ అయితే వెన‌క్కి తిరిగి అస్స‌లు చూసుకోను అని. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది క‌దా..! ఈయ‌న ఛార్మికి బాగా క‌నెక్ట్ అయిపోయాడ‌ని చాలాకాలం నుంచి ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఛార్మి కార‌ణంగానే పూరీ ఇంట్లో గొడ‌వ‌లు కూడా అయ్యాయ‌నే వార్త‌లొచ్చాయి. అయితే వీటిపై స్పందించడానికి పూరీకి అస్స‌లు టైమ్ లేదు. కానీ తాను చేసే ప‌నులు మాత్రం చేత‌లతోనే చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అప్పుడెప్పుడో న‌ట‌న మానేసిన ఛార్మితో జ్యోతిల‌క్ష్మి చేసి త‌న క‌నెక్టివిటీ గురించి చూపించాడు పూరీ జ‌గ‌న్నాథ్.
ఈ సినిమాతో పూర్తిగా ఫేడ‌వుట్ అయిపోయింది ఛార్మి. కానీ ఈమె ఫేడ‌వుట్ అయింది కేవ‌లం సినిమాల‌కే.. ఇండ‌స్ట్రీకి కాదు. ప్ర‌స్తుతం ఈమె రాణిలా బ‌తుకుతుంది. అది కూడా పూరీ అనే రాజుగారి కోట‌లో. సొమ్మొక‌డిది సోకొక‌డిది అన్న‌ట్లు ఇప్పుడు పూరీ సంపాద‌న‌ను ఛార్మి తీసుకుంటుంద‌నే వార్త‌లు అయితే ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. దానికి తోడు పూరీకి సంబంధించిన ప్ర‌తీ విష‌యంలోనూ ఛార్మి క‌నిపిస్తుంది. పూరీ త‌న కొడుకుతో తీస్తోన్న మెహ‌బూబా సినిమాపై కూడా చార్మి ఆధిప‌త్యం న‌డుస్తుంద‌నే టాక్ వినిపిస్తుంది. తాజాగా ప్ర‌మోష‌న‌ల్ వీడియోలోనూ ఛార్మినే ఎక్కువ‌గా క‌నిపించింది. షూటింగ్స్ లో కూడా ఛార్మి ప‌క్కాగా క‌నిపించింది.
పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాల‌తో బిజీ.. ఆయ‌న ఆస్తుల‌తో చార్మి బిజీ అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం అంటున్నాయి విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు. ఇప్పుడు మెహ‌బూబా సినిమాను కూడా ఛార్మి త‌న హ్యాండోవ‌ర్ లోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఆమె ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా ప‌ని చేస్తుంది. ఇందుకు గానూ ఏకంగా 4 కోట్ల పారితోషికం ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆమె హీరోయిన్ గా ఉన్న‌పుడు ల‌క్ష‌ల్లోనే ఉన్న ఛార్మి.. ఇప్పుడు మాత్రం కోట్ల‌కు కోట్లు తీసుకుంటుంది. దీనికి కార‌ణం పూరీ. అప్ప‌ట్లో నితిన్ తో పూరీ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం ఛార్మి చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్ అని ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌యుడి సినిమాకు ఇలాంటి క‌థ‌లే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఛార్మి య‌వ్వారం ఎంత దూరం వెళ్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here