పెళ్లికి ముందు సెక్స్ పై కైరా క‌మెంట్స్..

సెక్స్ అనే ప‌దం ప‌ది మంది ముందు వాడ్డానికి కాస్త ఆలోచిస్తాం. కానీ అది కూడా రోజులో భాగ‌మే క‌దా అనేంత సింపుల్ గా మాట్లాడేస్తున్నారు కొంద‌రు హీరోయిన్లు. ఏ భ‌యం బెరుకు లేకుండా అన్నీ మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు కైరా అద్వానీ కూడా ఇదే చేస్తుంది. ఈ భామ తాజాగా సెక్స్ గురించి మాట్లాడింది. సెక్స్ అనే ప‌దాన్ని ఎందుకు అంద‌రూ త‌ప్పుగా చూస్తున్నారు అని రివ‌ర్స్ లో అడుగుతుంది. నేచుర‌ల్ థింగ్ అయిన సెక్స్ ను అంత‌గా దాచాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందని కౌంట‌ర్ వేస్తుంది ఈ ముద్దుగ‌మ్మ‌.

త‌న‌కు 15 ఏళ్లు ఉన్న‌పుడు సెక్స్ అనేది పెళ్లి త‌ర్వాత చేసుకోవాల‌ని చెప్పార‌ని.. కానీ అది త‌న దృష్టిలో త‌ప్పంటోంది కైరా. పెళ్లికి ముందు సెక్స్ లో త‌ప్పేం లేద‌ని.. అది వాళ్లిష్టం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కైరాఅద్వానీ. ఈమె క‌మెంట్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అప్ప‌ట్లో ఖుష్బూ.. మొన్నీమ‌ధ్యే రాధికాఆప్టే కూడా ఇలాంటి క‌మెంట్స్ చేసారు. ఇప్పుడు కైరా కూడా ఇదే క‌మెంట్స్ చేసింది.

అన్న‌ట్లు ఈ మ‌ధ్యే ల‌స్ట్ స్టోరీస్ లో ఊహ‌కు కూడా అంద‌నంత రేంజ్ లో రెచ్చిపోయింది కైరా. రాధిక ఆప్టే, మనీషా కోయిరాలా, కైరా అద్వానీ.. ఇలా చాలా మంది న‌టించారు ఈ సిరీస్ లో. ఒక్కొక్క‌రికి ఒక్కో ఎపిసోడ్. ప్ర‌తీ ఎపిసోడ్ లోనూ డోస్ పెంచేసారు ద‌ర్శ‌కులు. ఇక కైరా అద్వానీ ఎపిసోడ్ అయితే నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. కొత్త‌గా పెళ్లైన భార్య‌గా న‌టించింది ఇందులో కైరా. భ‌ర్త‌తో సంసార సుఖం స‌రిగ్గా అందుకోలేని భార్య‌గా న‌టించింది. దాంతో స్వ‌యంతృప్తి కోసం ఆరాట‌ప‌డే యువ‌తిగా.. బాబోయ్ ఆ న‌ట‌న‌తో పిచ్చెక్కించింది కైరా.

ఇలాంటి పాత్ర చేయ‌డానికి కూడా ధైర్యం కావాలి. కానీ చేసింది ఈ భామ‌. ల‌స్ట్ స్టోరీస్ చూసిన త‌ర్వాత కైరాను బాపురే ఏం భామ‌రే అనుకోకుండా ఉండ‌లేరు. అంత‌గా రెచ్చిపోయింది కైరా. ఇక ఇప్పుడేమో ఇలా పెళ్లికి ముందు సెక్స్ త‌ప్పు కాదంటోంది. మొత్తానికి నోటికి ఏదొస్తే అది భ‌యం లేకుండా మాట్లాడేస్తంఉది ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here